నవంబర్ 18 (ఆంధ్రపత్రిక): టాలీవుడ్ స్టార్ హీరో నాని సోదరి దీప్తి ఘంట డైరెక్ట్ చేస్తున్న అంథాలజీ ప్రాజెక్ట్ విూట్ క్యూట్. రుహానీశర్మ, వర్ష బొల్లమ్మ, ఆదా శర్మ, ఆకాంక్ష సింగ్, శివ కందుకూరి, సునయన ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మేకర్స్ ముందుగా ప్రకటించినట్టుగానే ట్రైలర్‌ను లాంఛ్ చేశారు. నీకు మీట్‌క్యూట్ అంటే తెలుసా..? అనుకోకుండా ఇద్దరు అపరిచితులు కలిసినపుడు.. ఆ క్యూట్ సిచ్యుయేషన్స్.. అంటూ అంథాలజీలో సాగే పాత్రలను పరిచయం చేస్తూ నాని వాయిస్ ఓవర్‌తో మొదలైంది ట్రైలర్. వివిధ రకాల ఏజ్ గ్రూప్స్‌లో ఉన్న వ్యక్తుల పరిచయం మొదలు కొని, వారి ప్రయాణం ఎలా సాగిందనే కథాంశంతో మీట్ క్యూట్ సాగనున్నట్టు ట్రైలర్‌తో చెప్పింది దర్శకురాలు దీప్తి ఘంట. మీట్ క్యూట్ చిత్రంలో సత్యరాజ్, రోహిణి, దీక్షిత్ శెట్టి కీలక పాత్రలు పోషిస్తున్నారు. మీట్ క్యూట్ సినిమాకు విజయ్ బల్గానిన్ సంగీతం అందిస్తుండగా.. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్ నేనితో కలిసి తెరకెక్కిస్తున్నాడు నాని. నవంబర్ 25 నుంచి సోనీ లివ్‌లో స్‌ట్టీమ్రింగ్ కానుంది మీట్ క్యూట్.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!