*మచిలీపట్టణం లో మెడికల్ మాఫియా ఆగడాలు.*
*రోగులకు కాలం చెల్లిన మందులు అంటగట్టి సోమ్ముచేసుకుంటున్న వైద్యురాలు.*
*బండారం బయట పడటంతో ఫార్మసిస్ట్ పై నెపం నేట్టివేస్తున్న డాక్టర్.*
*కృష్ణాజిల్లా మచిలీపట్టణం శ్రీ విజయ అమలేస్వరి దేవి మల్టి స్పెషాలిటి క్లినిక్ లో వెలుగుచూసిన ఘటన.*
మందులు వేసుకున్న కొంతసేపటికి కళ్ళు తిరగడం, ఒళ్లంతా దురదలు అనిపించడం వలన విషయం తన కుమారుడికి విన్నవించుకుంది. అనుమానం వచ్చి మందులను క్షుణ్ణంగా పరిశీలించగా అవి కాలం చెల్లిన మందులు అని తెలుసుకున్నారు.
విషయం సంబందిత డాక్టర్ కు ఫోనుచేసి అడగగా చాలా పెద్ద పొరపాటు జరిగిపోయింది ఈ విషయం ఎవరికీ చెప్పకుండా వెంటనే మందులు తిరిగి ఇచ్చేయ్యమని, రోగికి జీవితకాలం ఉచితంగా వైద్యం అందిస్తానని మొసలి కన్నీరు కార్చడం ప్రారంబించింది.
అనుకూలమైన డాక్టర్లకు మందుల షాపుల లైసెన్సులు లేకపోయినా, వాటికి కేటాయించాల్సిన స్థలము లేకపోయినా దండిగా సోమ్ముచేసుకోండి ఏదైనా సమస్య వస్తే నేను చూసుకుంటా అని డ్రగ్ ఇన్స్పెక్టర్ అభయ హస్తం ఇచ్చినట్లుగా ఉంది.