భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం పెరుగుతుండటంతో వరద ముంపు తో ఇబ్బందులు పడుతున్న వేలేరుపాడు మండలంలోని వివిధ గ్రామాల ప్రజలకు అధికార యంత్రాoగం బాసటగా నిలిచింది. వరద కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ ఆదేశాలతో జిల్లా పరిషత్ సి ఈ ఓ కె. రవికుమార్, డ్వామా పీడీ రాంబాబులు బుధవారం ఉదయం హుటాహుటిన వేలేరుపాడు చేరుకొని తహసీల్దార్ చల్లన్న దొరతో కలిసి 5 నివాసిత ప్రాంతాలలోని ప్రజలతో అత్యవసర సమావేశాలు నిర్వహించారు. ఆయా గ్రామాలలోని వి ఆర్ ఓ లు, సచివాలయాలు సిబ్బంది, గ్రామ స్థాయి అధికారులతో సమావేశాలు నిర్వహించి తక్షణం తీసుకోవలసిన చర్యలపై చర్చించారు. వరద వరద ముంపు ప్రాంతాల ప్రజలకు అత్యవసరంగా కూరగాయలు, వాటర్ ప్యాకెట్లు, పాలు, నిత్యావసర సరుకులను అందించారు. రవాణా సదుపాయం లేని గ్రామాలకు సిబ్బంది పడవలలో వెళ్లి అందించి, వారికి ధైర్యం చెప్పారు. వరద నీరు పెరిగే సమయంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చి పునరావాస శిబిరాలలో వసతి భోజన సదుపాయాలు కల్పిస్తామన్నారు. గురువారం కూడా కూరగాయలు, నిత్వసర సరుకులు అందించేందుకు 13 టన్నుల కూరగాయలు, లక్ష వాటర్ ప్యాకెట్లు, 2100 లీటర్ల పాల ప్యాకెట్లు, 20 వేల కాండిల్స్, 250 గ్యాస్ సిలండర్లు సిద్ధం చేశామని, గురువారం ఉదయం నుండి వరద ముంపు ప్రాంతాలలోని కుటుంబాలకు పంపిణీ చేస్తామని జెడ్పి సి ఈ ఓ రవికుమార్ చెప్పారు. వరద ముంపు ప్రమాదం తొలగి పోయే వరకు అప్రమత్తం ఉండాలని, ఏ సమయంలోనైనా ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధం ఉండాలని గ్రామ, మండల స్థాయి అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. వరద నీటితో ప్రస్తుతం ఎటువంటి ప్రమాదం లేదని, వరద ఉధృతి మరింత పెరిగితే తీసుకోవలసిన అత్యవసర చర్యలపై గ్రామ, మండల స్థాయి అధికారులతో సమీక్షించడం జరిగిందన్నారు
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!