దాదాపు రూ.70 వేల కోట్ల అవినీతి
విచారణలో బయటపడుతుందన్న షర్మిల
హైదరాబాద్,అక్టోబర్ 22 (ఆంధ్రపత్రిక): కాళే శ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో దేశంలోనే అతిపెద్ద స్కామ్ జరిగిందని వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. ప్రాజెక్ట్ నిర్మాణంలో దాదాపు రూ.70 వేల కోట్ల అవినీతి జరిగిందని అన్నారు. కాళేశ్వరం అవినీతిపై దర్యాప్తు జరుపుతామని సీబీఐ, కాగ్ హావిూ ఇచ్చాయని షర్మిల చెప్పారు. రాష్ట్రంలో భారీ అవినీతి జరిగినా వైఎస్సార్టీపీ తప్ప ఇంకే పార్టీ ఆ అంశంపై ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్ట్‌ను రూ.38 వేల కోట్లతో చేపడితే.. ప్రాజెక్ట్ రీడిజైన్ పేరుతో సీఎం కేసీఆర్ భారీ అవినీతికి పాల్పడ్డారని షర్మిల విమర్శించా రు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో జాతీయస్థాయిలో అవి నీతి జరిగిందని మండిపడ్డారు. ప్రాజెక్టు నిర్మా ణంలో కేసీఆర్, మేఘా కృష్ణారెడ్డి తోడు దొంగ లైతే.. బండి సంజయ్, రేవంత్‌రెడ్డి జీతగాళ్లని షర్మిల కామెంట్ చేశారు. ప్రాజెక్ట్‌లో జరిగిన అవి నీతిపై బండి సంజయ్, రేవంత్ రెడ్డి ముఖ్య మంత్రిని ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీ శారు. మేఘా కృష్ణారెడ్డి అనే వ్యక్తి కేసీఆర్, బండి సంజయ్, రేవంత్ రెడ్డి, విూడియా సహా అందరినీ మేనేజ్ చేస్తున్నాడని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అవినీతి జరిగిందని పదేపదే ఆరో పణలు చేసే బీజేపీ.. కేసీఆర్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని షర్మిల ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల డబ్బును కేసీఆర్ బందిపోటులా దోచుకున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం అవినీతిపై కేంద్రం ఎంక్వైరీ కమిషన్ వేయాలని షర్మిల డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీజేపీ, టీఆర్ఎస్ ఒక్కటేనని అనుకోవాల్సి వస్తుందని అన్నారు. విభజన హావిూలు నెరవేర్చని బీజేపీ మునుగోడులో సిగ్గులేకుండా ఓట్లు అడుగుతోందని షర్మిల ఫైర్ అయ్యారు