వెస్ట్ గోదావరి, సెప్టెంబర్ 27 (ఆంధ్రపత్రిక): మొగల్తూరు గ్రామానికి చెందిన ప్రముఖ సినీ నటుడు రెబల్ స్టార్ ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు మంచి మనసున్న మహారాజు అని ఈ ప్రాంతానికి చెందిన ప్రతివారు తలుస్తూ ఉంటారు. 1940 జనవరి 20న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో కృష్ణంరాజు జన్మించారు. మొగల్తూరులో విద్య పూర్తి చేసుకోగానే కొంతకాలం జర్నలిస్టుగా పనిచేశారు హీరోగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టి విలన్ పాత్రలో అందర్నీ ఆకట్టుకున్నారు. 1966లో “చిలకా గోరింకా” చిత్రంతో వెండి ధర అరంగ్రేటం చేశారు. మొగల్తూరులో సంపన్న కుటుంబంలో పుట్టిన కృష్ణంరాజు హైదరాబాదు బద్రుక కళాశాలలో కామర్స్ పట్టభద్రుడు పూర్తి చేశారు. అప్పటికే శాసనసభ్యుడిగా ఉన్న చింతలపాటి వరప్రసాద్ మూర్తి రాజు కృష్ణంరాజు పినతండ్రి. ఆయన ప్రారంభించిన “ఆంధ్ర రత్న”పత్రిక నిర్వహణ బాధ్యత తో పాటు సినీ సౌండ్ స్టూడియో నిర్వహణ కూడా కృష్ణంరాజు పర్యవేక్షిస్తూ ఉండేవాడు. కృష్ణంరాజు పూర్వీకులు తూర్పుగోదావరి జిల్లా ఎర్రంపాలెం నుండి సుమారుగా 100 సంవత్సరాల క్రితం మొగల్తూరు వచ్చి స్థిరపడినట్లు తెలుస్తోంది. కృష్ణంరాజు తండ్రి ఉప్పలపాటి వీర వెంకట సత్యనారాయణ రాజు తల్లి లక్ష్మి నరసాయమ్మ వీరికి ఆరుగురు కుమార్తెలు, ఇరువురు కుమారులు ఉన్నారు. వీరిలో మూడో సంతానం కృష్ణంరాజు 1940 జనవరి 20వ తేదీన జన్మించారు. వెండి తెరతో పాటు రాజకీయ రంగంలో కృష్ణంరాజు తన సత్తా చాటుకున్నారు. కాంగ్రెస్ నుండి రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన 1998 కాకినాడ పార్లమెంటు స్థానం నుండి బిజెపి అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగి విజయం సాధించారు. 1999లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో నరసాపురం పార్లమెంటు స్థానం నుండి పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొందారు. గ్రామీణ అభివృద్ధి శాఖ, విదేశాంగ రక్షణ సహాయ శాఖ మంత్రిగా పనిచేసి విశిష్టమైన ప్రజలకు సేవలు అందించారు. కేంద్ర మంత్రిగా సేవలందించిన కృష్ణంరాజుకు గవర్నర్ పదవి వస్తుందని సమాచారం ఈమధ్య ఎక్కువగా వార్తలు నిలబడ్డాయి. సాధారణంగా కృష్ణంరాజు ఇంటికి అభిమానులు వచ్చిన భోజనం చేస్తేనే గాని తిరిగి పంపేవారు కాదని ప్రచారం విస్తృతంగా మంచి మనస్తత్వం గల మనిషిగా కృష్ణంరాజు పేరు నేటికీ కొనసాగుతూ ఉంది. 1977 అమరదీపం, 1978 మన ఊరి పాండవులు, ఫిలిం అవార్డు సౌత్ ఉత్తమ నటుడు, ప్రత్యేక జూరీ అవార్డు, ధర్మాత్ముడు బొబ్బిలి బ్రహ్మన్న తాండ్రపాపారాయుడు, ఫిలింఫేర్ లైఫ్ టైం అటాచ్మెంట్ అవార్డులు లభించాయి. మొగల్తూరు గ్రామాన్ని సినీ రంగంగా, రాజకీయ రంగంగా ప్రపంచానికి గుర్తింపు తీర్చుకోవచ్చిన ఘనత కృష్ణంరాజుకే దక్కిందని మొగల్తూరు గ్రామంలో పలువురు అభిమానులు అభిప్రాయం చేశారు. కృష్ణంరాజు బహుముఖ నటనతో సమాజ సేవతో కోట్లాదిమంది హృదయాలను గెలుచుకున్న మహోన్నతమైన వ్యక్తిగా పలువురు కొలుస్తున్నారు. 83 ఏళ్ల వయసులో సుమారుగా 55 ఏళ్లు సినీ నటుడుగా తన ప్రస్తావన సాగించి లక్షలాది మంది సినీ ప్రేక్షకుల హృదయాలలో స్థిరస్థానం ఏర్పరచుకున్నారు. సినీ రంగంలో రాజకీయ రంగంలో కృష్ణంరాజు సంపాదించిన మంచి పేరును ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలుస్తూ ఉంటారని మొగల్తూరు గ్రామ ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!