మచిలీపట్నం సెప్టెంబర్ 27 ఆంధ్ర పత్రిక.
ప్రజా సమస్యలకు మెరుగైన పరిష్కారంతో పాటు వారిలో సంతృప్తి స్థాయి పెంపొందించేందుకు ప్రభుత్వం” జగనన్నకు చెబుదాం” ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నదని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు పేర్కొన్నారు.
“జగనన్నకు చెబుదాం” మండల స్థాయి ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం బుధవారం స్థానిక కొండపల్లి కన్వెన్షన్ నందు జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ డాక్టర్ అపరాజత సింగ్, వివిధ శాఖల జిల్లా, మండల స్థాయి అధికారులతో కలిసి నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సమస్యకు పరిష్కారమే లక్ష్యం అన్నారు. సమస్యల పరిష్కారం కొరకు ప్రజలు కలెక్టరేట్ వరకు రాకుండా మండలంలోనే అధికారులతో కలిసి “జగనన్నకు చెబుదాం” కార్యక్రమాన్ని నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిందన్నారు. ఈ మేరకు జిల్లాలో ప్రతి బుధవారం, శుక్రవారం మండల స్థాయిలో జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు, ఇప్పటివరకు ఉంగుటూరు, కోడూరు, మొవ్వ మండలాల్లో జెకెసి నిర్వహించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఈరోజు నందివాడలో జగనన్నకు చెబుదాం కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వచ్చిన అర్జీలు, ఇదివరకు పెండింగ్లో ఉన్నవి క్రోడీకరించుకుని, వాటి పరిష్కారానికి జిల్లా అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి, అర్జీదారులతో మాట్లాడి, సెల్ఫీ తీసుకుని, తగిన విచారణ నిర్వహించి, నిబంధనల మేరకు పరిష్కరించాలన్నారు. సమస్యల పరిష్కారానికి జిల్లా అధికారులే గ్రామాలకు వెళుతున్నందువల్ల ప్రజల్లో సంతృప్తి పెరుగుతుందన్నారు. జగనన్నకు చెబుదాం మండలాల్లో నిర్వహిస్తుండడం వల్ల చాలా సమస్యలు పరిష్కారం అవుతున్నాయని తెలిపారు.
బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో 33 అర్జీలు అందాయని, మండల పరిధిలో భూ సమస్యలపై ఎక్కువగా అర్జీలు అందాయన్నారు.
తొలుత జాయింట్ కలెక్టర్ నందివాడ మండలంలో జగనన్నకు చెబుదాం పెండింగ్ అర్జీలతోపాటు, రీఓపెన్ కేసులు, అసంతృప్తి కేసులకు సంబంధించి అధికారులు తీసుకున్న చర్యలపై సమీక్షించారు.
మండలంలో జగనన్నకు చెబుదాంలో రీ ఓపెన్, అసంతృప్తి కేసులలో సంబంధిత అధికారులు తీసుకున్న చర్య నివేదిక సమావేశంలో వివరించారు.
జగనన్నకు చెబుదాం పెండింగు కేసులు అన్నీ కూడా వెంటనే విచారించి సరైన సమాధానం పంపాలన్నారు.
వర్షపు నీటి సంరక్షణ నిర్మాణానికి పనులు ప్రారంభించిన కలెక్టర్ రాజా బాబు.
తొలుత జిల్లా కలెక్టర్ స్థానిక జడ్పీ హైస్కూల్ ఆవరణలో ఉపాధి హామీ పథకం కింద 12 అడుగుల విస్తీర్ణంలో వర్షపు నీటి సంరక్షణ నిర్మాణం పనులు జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ప్రారంభించారు.
జగనన్నకు చెబుదాం” అర్జీలు..
నందివాడ మండలం ఇలపర్రు గ్రామంలో గతంలో ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ భూములు అన్యాక్రాంతం అయ్యాయని, తిరిగి సర్వే జరిపించి పేదలకు చెందేలా చర్యలు తీసుకోవాలని కుర్మా రాధాకృష్ణ తదితరులు అర్జీ సమర్పించారు.
నందివాడలో తమిరిశ రోడ్డులో ఆక్వా చెరువులకు విద్యుత్ సరఫరా చేసే ట్రాన్స్ఫార్మర్ మరమ్మతులకు గురైందని, ఫీజులు పోవడం మోటార్లు చెడిపోవడం జరుగుతున్నదని, ఆక్వా రైతులు నష్టపోతున్నారని, సమస్య పరిష్కరించాలని కోరుతూ గరిమెళ్ళ రవి తదితరులు అర్జీ సమర్పించారు.
అర్జీల నమోదుకు ప్రత్యేకంగా కంప్యూటర్లతో రిజిస్ట్రేషన్ డెస్క్ ఏర్పాటు చేశారు. అర్జీదారులు కోసం కుర్చీలు ఏర్పాటు చేసి త్రాగునీటి సౌకర్యం కల్పించారు.
తొలుత జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం,
ఐసిడిఎస్ ఆధ్వర్యంలో సంపూర్ణ పోషణ మాసోత్సవ శిబిరం, డిఆర్డిఏ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన డ్వాక్రా ఉత్పత్తుల శిబిరాలను సందర్శించారు.
ఐసిడిఎస్ మహిళలు చిరుధాన్యాలతో తయారుచేసిన వంటకాలు ప్రదర్శించారు. మహిళలకు అవగాహన కల్పించారు.
మండల తాసిల్దారు, ఎంపీడీవో కార్యక్రమ ఏర్పాట్లు పర్యవేక్షించారు.
డిఆర్ఓ పి. వెంకటరమణ, ఆర్డీవో పద్మావతి, డ్వామా పిడి జీవి సూర్యనారాయణ, డి ఆర్ డి ఏ పిడి పిఎస్ఆర్ ప్రసాద్, ఐసిడిఎస్ పిడి ఎస్ సువర్ణ, డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ జి గీతాబాయి, జిల్లా వ్యవసాయ అధికారి పద్మావతి, డీఎస్ఓ పార్వతి, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి షాహిద్ బాబు, డిటిడబ్లు
ఓ ఫణి దూర్జటి, జిల్లా పరిశ్రమల అధికారి కే వెంకట్రావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, మండల అధికారులు పాల్గొన్నారు.