డిసెంబర్ 07 (ఆంధ్రపత్రిక): మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఇండియాలో ఏ హీరో లేనంత బిజీగా ఉన్నాడు. ఏడాదికి అరడజను సినిమాలు చేస్తూ తీరక లేకుండా గడుపుతున్నాడు. ప్రస్తుతం సౌత్, నార్త్ అని తేడా లేకుండా ప్రతీ భాషలో మార్కెట్ పెంచుకోవాలని గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. ఇటీవలే అతను నటించిన ’కడువా’ పాన్ ఇండియా సినిమాగా రిలీజై మంచి విజయం సాధించింది. ఇక పృథ్విరాజ్ ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తునే పరభాషల్లో ముఖ్య పాత్రలు పోషిస్తున్నాడు. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ’సలార్’లో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఇదిలా ఉంటే పృథ్వీరాజ్ తాజాగా బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమయ్యాడు. అక్షయ్‌కుమార్, టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న చిత్రం ’బడే మియాన్ చోటే మియాన్’. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పృథ్వీరాజ్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా ఈయన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ కబీర్ పాత్రలో కనిపించనున్నాడు. తాజాగా విడుదలైన పోస్టర్లో బ్లూ కలర్ బ్లేజర్ ధరించి స్టైలిష్ విలన్లా ఉన్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పూజా ఎంటర్టైన్మెంట్స్, ఆజ్ ఫిలింస్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రాన్ని హిందీతో పాటు సౌత్‌లోని అన్ని భాషల్లో వచ్చే ఏడాది రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!