ఓపిఎస్‌కు మద్దతు పలికిన శశికళ
చెన్నై, మార్చి 25 (ఆంధ్రపత్రిక) : శాసనస భలో ఆన్లైన్ రవ్మిూ నిషేధ చట్టానికి మద్దతుగా మాజీముఖ్యమంత్రి. పన్నీర్‌సెల్వం ప్రకటన ను అన్నాడీఎంకే అసమ్మతి వర్గం నాయకురాలు శశికళ స్వాగతించారు. ఇది ఓ మంచి ప్రయత్న మని అన్నారు. అయితే పన్నీర్ ప్రకటనననిరసి స్తూ మరో మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళని స్వామి వర్గీయులు గలాభా చేయడం గర్హనీయ మని శశికళ పేర్కొన్నారు. తిరువారూరులో కొన్ని ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొనే నిమిత్తం నాగపట్టినం వెళ్ళిన శశికళ అక్కడి విూడియాతో మాట్లాడుతూ శాసనసభలో ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడమే ప్రజాస్వామ్య లక్షణమని అన్నారు. ఆ దిశగానే ఓపీఎస్ ఆన్లైన్ నిషేధ చట్టానికి మద్దతుగా ప్రసంగించడం తప్పుకాదన్నారు. అదే సమయంలో ఓపీఎస్‌కు నిరసనగా అన్నాడీఎంకే శాసనసభ్యులంతా సభలో గలాభా చేయడం గర్హనీయమన్నారు. ఈపీస్ వర్గీయులకు నిరసన తెలుపటం వల్ల తాను ఓపీఎస్ వర్గానికి మద్దతు ఇస్తున్నట్లు అపోహ పడకూడదని అన్నారు. ఈపీఎస్, ఓపీఎస్ వర్గీయుల గొడవ లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపదన్నారు. త్వరలో ఓపీఎస్ తనను కలుసుకునే అవకాశం ఉందని, తామంతా ఒకే పార్టీకి చెందినవారం కాబట్టి ఎప్పుడైనా కలుసుకుని రాజకీయ పరిస్థితులపై చర్చిస్తామన్నారు. విడిపోయిన వారందరినీ ఏకతాటిపైకి తెచ్చి లోక్‌సభ ఎన్నికల్లో అన్ని చోట్లా గెలిచి తీరుతామని శశికళ ధీమా వ్యక్తం చేశారు.