మచిలీపట్నం నవంబర్ 19 ఆంధ్ర పత్రిక.
భారత్ ప్రపంచ కప్ సాధించాలని, కోరుకుంటూ మైత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచ కప్ లో భారత్ విజయాన్ని కాంక్షిస్తూ మైత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదానం నిర్వహించడం అభినందనీయమని పలువురు ప్రసంశించారు. మైత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక అరుణ బ్లడ్ బ్యాంక్ నందు రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ప్రపంచ కప్ ఫైనల్లో భాగంగా ఇండియా ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ లో భారత దేశం నెగ్గాలని ఆకాంక్షిస్తూ మైత్రి ఫౌండేషన్ ఇచ్చిన పిలుపుమేరకు రక్తదానం చేయడానికి పలువురు యువత ముందుకు వచ్చారు. మైత్రి ఫౌండేషన్ సభ్యులతో పాటు సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న కొంత మంది యువకులు, స్వచ్ఛందంగా రక్త దానం చేయడానికి ముందుకు వచ్చారని నిర్వాహకులు తెలిపారు. క్రికెట్ ప్రేమికులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గం వరకు జరిగిన ఈ రక్తదాన కార్యక్రమంలో మొత్తం 12 మంది రక్తదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మైత్రి ఫౌండేషన్ అధ్యక్షులు కేసాని వేణు కుమార్ మాట్లాడుతూ యువతలో దేశభక్తి పెంపొందించేందుకే ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ శిబిరానికి బందరు పట్టణ యువత నుండి మంచి స్పందన వచ్చిందని గత స్వాతంత్ర్య దినోత్సవం నాడు కూడా తమ సంస్థ ఆధ్వర్యంలో 50 మందితో రక్తదాన శిబిరాన్ని నిర్వహించామని గత రెండు సంవత్సరాల కాలంలో అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైన వారికి షుమారు 500 యూనిట్స్ బ్లడ్ అందించామని తెలిపారు . మానవ సేవే మాధవ సేవ అన్నది మైత్రి ఆశయం అన్నారు. ఈ కార్యక్రమంలో మైత్రి ఫౌండేషన్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.