సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) అభిమానులతో పాటు ప్రతి ఒక్క తెలుగు సినీ ప్రేక్షకుడు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ప్రారంభోత్సవం ఈ సంవత్సరంలో లేదని తేలి పోయింది.
రాజమౌళి( Rajamouli ) దర్శకత్వం లో మహేష్ బాబు హీరోగా రూపొందాల్సిన సినిమా షూటింగ్ కార్యక్రమాలను ప్రారంభించేందుకు వచ్చే ఏడాది సమ్మర్ కి ముహూర్తం ఫిక్స్ చేయడం జరిగిందట. మహేష్ బాబు ప్రస్తుతం చేస్తున్న త్రివిక్రమ్ మూవీ జూన్ జూలై వరకు షూటింగ్ పూర్తి అయ్యే అవకాశాలున్నాయి. మరో వైపు రాజమౌళి ఆస్కార్ హడావుడి నుండి వచ్చిన తర్వాత విశ్రాంతి లో ఉన్నాడు. అతి త్వరలోనే స్క్రిప్ట్ వర్క్ మొదలు పెట్టే అవకాశం ఉందట. ఇప్పటికే రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్( Vijayendra Prasad ) కథ ను రెడీ చేశాడనే వార్తలు వస్తున్నాయి. అన్ని అనుకున్నట్లుగా జరిగితే స్క్రిప్టు వర్క్ ఈ సంవత్సరం చివరి వరకు పూర్తి చేసి వచ్చే సంవత్సరం వేసవి కానుకగా సినిమా ను సెట్స్ పైకి తీసుకు వెళ్లే అవకాశం ఉందని రాజమౌళి టీం మెంబెర్స్ అనధికారికంగా తెలియజేశారు. మహేష్ బాబు హీరో గా రాజమౌళి దర్శకత్వం లో రూపొందిన సినిమా కి హాలీవుడ్ స్థాయిలో క్రేజ్ ఉండబోతోంది.
అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ సినిమా ను కూడా ఆస్కార్ బరిలో నిలబెట్టాలని రాజమౌళి కోరుకుంటున్నాడట. 2025 సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి సినిమా విడుదల తేదీ ఒకటి అనుకుంటే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఆలస్యం అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. కనుక ఇప్పట్లో విడుదల తేదీ గురించి మాట్లాడుకోవడం వృధా. సినిమా ప్రారంభం కోసమే ఏడాది ఆగాలి అంటే సినిమా విడుదల కోసం ఎన్నాళ్లు వెయిట్ చేయాల్సి ఉంటుందో మీరే అర్థం చేసుకోవచ్చు. హాలీవుడ్ నిర్మాణ సంస్థతో పాటు అక్కడి టెక్నీషియన్స్ ను ఈ సినిమా లో ఇన్వాల్వ్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.