జనవరి 02 (ఆంధ్రపత్రిక): టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు సినిమాల్లోనే కాదు.. నిజజీవితంలోనూ హీరోనే. వరుస సినిమాలు, కుటుంబంతో బిజీగా ఉండే ఆయన.. మరోవైపు సామాజిక సేవ చేస్తున్నారు. ప్రాణాపాయస్థితిలో ఉన్నఎందరో చిన్నారులకు తన వంతు సాయం చూస్తూ పెద్ద మనసు చాటుకుంటున్నారు. మహేశ్ బాబు ఫౌండేషన్ ద్వారా ఆంధ్రా హాస్పిటల్స్ సహకారంతో ఇప్పటికే వందలాది మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించి వారి కుటుంబాల్లో ఆనందం నింపారు. అంతేకాకుండా తన తండ్రి స్వగ్రామమైన ఆంధప్రదేశ్‌లోని బుర్రిపాలెం, తెలంగాణలోని సిద్దాపురం గ్రామాలను దత్తత తీసుకుని నిజమైన శ్రీమంతుడు అనిపించుకున్నారు. దత్తత గ్రామాల్లో వైద్య సదుపాయాలు, బడులు, రోడ్లు వంటివి చేసి గ్రామాల రూపురేఖలనే మార్చేస్తున్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండే మహేశ్.. ప్రచారానికి మాత్రం దూరంగా ఉంటారు. కొత్త ఏడాది సందర్భంగా మహేశ్ మరో అడుగు ముందుకేశారు. తన సేవా కార్యక్రమాలను మరింత విస్తరించేందుకు కొత్త వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. మహేశ్ బాబు ఫౌండేషన్ డాట్ ఆర్గ్ పేరుతో ఈ వెబ్‌సైట్‌ను తీసుకువచ్చారు. పిల్లల కోసం నూతన సంవత్సరాది రోజున ఈ వెబ్సైట్ ప్రారంభిస్తున్నట్టు మహేశ్ ముద్దుల తనయ సితార ఘట్టమనేని వెల్లడిరచింది. కొత్త ఏడాది ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ తన సందేశాన్ని ట్విట్టర్లో వెలువరించింది. ఈ నెల తన పాకెట్ మనీని మహేశ్ బాబు ఫౌండేషన్‌కు విరాళంగా ఇస్తున్నట్లు తెలిపింది. మీరు కూడా మీ వంతు సాయం చేయండి అంటూ విజ్ఞప్తి చేసింది. మనందరం కలిసి పిల్లల కోసం మరింత మెరుగైన ప్రపంచాన్ని సృష్టిద్దాం అని పేర్కొంది.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!