తన తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ ప్రథమ వర్ధంతి (నవంబర్ 15) సందర్భంగా మరో మంచి పనికి శ్రీకారం చుట్టాడీ శ్రీమంతుడు. సూపర్‌స్టార్ కృష్ణ ఎడ్యుకేషనల్ ఫండ్ పేరుతో పేద విద్యార్థుల చదువు కోసం ఆర్థిక సాయమందించేందుకు ముందుకొచ్చారు మహేశ్ బాబు దంపతులు. ఇందులో భాగంగా 40 మందికి పైగా పేద విద్యార్థులను ఎంపిక చేసి.. ఈ స్కాలర్షిప్ అందించనున్నారు
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు మరో మంచి పనికి శ్రీకారం చుట్టారు. సినిమాలతో పాటు సేవా కార్యక్రమాల్లో చురుగ్గా వ్యవహరించే మహేశ్ బాబు తన ఉదారతను చాటుకున్నారు. మహేశ్ బాబు ఫౌండేషన్‌ను స్థాపించిన ఈ హ్యాండ్సమ్ హీరో వేలాది మంచి చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయించారు. తద్వారా వారి తల్లిదండ్రుల కళ్లల్లో వెలుగులు నింపారు. తాజాగా తన తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ ప్రథమ వర్ధంతి (నవంబర్ 15) సందర్భంగా మరో మంచి పనికి శ్రీకారం చుట్టాడీ శ్రీమంతుడు. సూపర్‌స్టార్ కృష్ణ ఎడ్యుకేషనల్ ఫండ్ పేరుతో పేద విద్యార్థుల చదువు కోసం ఆర్థిక సాయమందించేందుకు ముందుకొచ్చారు మహేశ్ బాబు దంపతులు. ఇందులో భాగంగా 40 మందికి పైగా పేద విద్యార్థులను ఎంపిక చేసి..ఈస్కాలర్షిప్అందించనున్నారు. స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఆర్థిక సాయం అందించనున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మహేశ్ భార్య నమత్ర ఇప్పటికే నలుగురు పేద విద్యార్థులను ఎంపిక చేశామని రేపటి రోజు ఎంతమంది అవుతారో చెప్పలేమన్నారు.
మామయ్య (కృష్ణ) గారి వర్దంతి సందర్భంగా.. ఆయన పేరు మీద ఒక స్కాలర్ షిప్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఇప్పటికే నలుగురు చురుకైన పేద విద్యార్థులను ఎంపిక చేశాం. ఇక నుంచి వారిని చదివించే బాధ్యతను మా ఎంబీ ఫౌండేషన్ చూసుకుంటుంది. పాఠశాల చదువు నుంచి ఎంత వరకు చదువుకున్నా.. అందుకు అయ్యే ఖర్చులన్నీ మేమే భరిస్తాం. ఈ కార్యక్రమంలో మామయ్య ఆశీస్సులు మాకు ఉంటాయని ఆశిస్తున్నాం. నేడు నలుగురు విద్యార్థులు రేపటి రోజు ఎంతమంది అవుతారో చెప్పలేం. మాకు చేతనైనంత వరకు పేద విద్యార్థులను చదివించి వారి అందమైన భవిష్యత్‌కు పునాది వేయాలన్నదే మా లక్ష్యం’ అని నమ్రత చెప్పుకొచ్చారు. మహేశ్ బాబు దంపతుల నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ‘దటీజ్ మహేశ్ బాబు’.. ‘మీ మనసు బంగారం సార్’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.