అక్టోబర్ 13 (ఆంధ్రపత్రిక): ’సర్కారు వారి’ పాట సినిమాతో అభిమానుల్లో జోష్ నింపాడు మహేష్‌బాబు. ప్రస్తుతం అదే జోష్‌తో త్రివిక్రమ్‌తో సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్‌కు సిద్ధమవుతుంది. ఈ చిత్రంలో మహేష్ గతంలో ఎన్నడూ చేయలేని మాస్ పాత్రలో కనిపించనున్నాడట. వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది ఎప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇక దీపావళి సందర్భంగా చిత్రబృందం ఈ సినిమా టైటిల్‌ను రివీల్ చేయనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే తాజాగా మహేష్‌బాబు లుక్ ఒకటి నెట్టింట్లో తెగ వైరల్‌గా మారింది. లేటెస్ట్‌గా రిలీజ్ అయిన లుక్‌లో మహేష్‌బాబు సరికొత్త హేయిర్ స్టైల్‌తో అల్టా స్టైలిష్‌గా ఉన్నాడు. ప్రముఖ సెలబ్రెటీ హేయిర్‌డ్రెస్సర్ అలీమ్ హకిమ్ మహేష్‌బాబు ఫోటోను సోషల్ విూడియాలో పోస్ట్ చేశాడు. ఈ ఫోటో క్షణాల్లోనే వైరల్‌గా మారింది. మరి ఈ హేయిర్ స్టైల్ సినిమా కోసమా.. లేదంటే క్యాజువల్‌గా చేయించుకున్నాడా అనేది తెలియాల్సి ఉంది. ఇక మహేష్`తివిక్రమ్ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. హారికా/ హాసినీ క్రియేషన్స్ పతాకంపై చినబాబు అత్యంత భారీ బ్జడెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నాడట.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!