ఓ బట్టల దుకాణంలో మహిళా కిలాడీలు చేతివాటం చూపెట్టారు. కొనుగోలు కోసం వచ్చిన ఐదుగురు మహిళలు షాపు యజమాని కళ్ళు కప్పి రూ. 20 వేల విలువ చేసే చీరలు, షార్ట్స్ మాయం చేసిన సంఘటన సంచనంగా మారింది.. సీసీ కెమెరాలు వారిని గట్టడం తో కథ అడ్డం తిరిగి..
ఓ బట్టల దుకాణంలో మహిళా కిలాడీలు చేతివాటం చూపెట్టారు. కొనుగోలు కోసం వచ్చిన ఐదుగురు మహిళలు షాపు యజమాని కళ్ళు కప్పి రూ. 20 వేల విలువ చేసే చీరలు, షార్ట్స్ మాయం చేసిన సంఘటన సంచనంగా మారింది.. సీసీ కెమెరాలు వారిని గట్టడం తో కథ అడ్డం తిరిగి కటకటాల పాలయ్యారు..
ఈ కిలాడీల చోరీ చేసిన విధానం ఇలా..
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో జరిగింది.. ప్రతి శుక్రవారం సంత (అంగడి ) జనాలతో రద్దీగా ఉంటుంది. ఇది గమనించిన ఐదుగురు మహిళా దొంగలు షాపులోకి వెళ్ళారు.. ఒకరు షాపు నిర్వాహకున్ని బట్టలు చూపించమని మాటల్లో పెట్టారు.. మిగతా దొంగలు విలువైన బట్టలను దోచుకున్నారు. షాపు యజమానికి రెండు షాపులు ఉన్నాయి. అయితే రెండో షాప్ లో సీసీ కెమెరా దృశ్యాలు గమనించిన నానో ఫ్యాషన్ యజమాని పవన్ వెంటనే అక్కడికి చేరుకొని ఆ మహిళా దొంగలకు దేహశుద్ధి చేశారు.
ఈ క్రమంలో ముగ్గురు పరారయ్యారు. ఇద్దరిని పట్టుకున్న షాప్ యజమానులు పోలీసులకు అప్పగించాడు. గత కొంతకాలంగా మండల కేంద్రాన్ని ఎంచుకొని అంగడి రోజు కిరాణా షాప్ లో చొరబడి నూనె డబ్బాలు సబ్బులు, సర్ఫులు(డీటేర్జెంట్) సైతం తదితర వస్తువులు దోచుకున్న సంఘటనలు ఉన్నాయి. పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకొని పరిశీలించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.. పరారైన వారి కోసం విచారణ జరుపుతున్నారు.