రాబోయే ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి వస్తే అమలు చేయబోయే సంక్షేమ పథకాల గురించి వివరిస్తున్న టిడిపి నాయకురాళ్లు, నాయకులు..
పేదరికం నిర్మూలనే ధ్యేయంగా మహాశక్తి పథకం..
తెలుగుదేశం తోనే మహిళా సంక్షేమం సాధ్యం…. తెలుగుదేశం పార్టీ మచిలీపట్నం నియోజకవర్గం తెలుగు మహిళా అధ్యక్షురాలు… లంకి శెట్టి నీరజ..! ఆగస్టు 12 (ఆంధ్ర పత్రిక) వక్కలంక వెంకట రామకృష్ణ, స్టాఫ్ రిపోర్టర్..!
తెలుగు మహిళ మచిలీపట్నం నియోజకవర్గం అధ్యక్షురాలు లంకి శెట్టి నీరజ మీడియాతో మాట్లాడుతూ
ప్రతి గడపకు వెళ్లి, చంద్రబాబుని ముఖ్యమంత్రిగా గెలిచిన వెంటనే నిబంధనలు లేకుండా , వివక్ష కు తావు లేకుండా
తల్లికి వందనం పేరుతో ప్రతి ఇంట్లో ఎంత మంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఒక్కొక్కరికి ఏడాదికి, 15000 రూపాయలు అందిస్తారని అన్నారు.
ఆడబిడ్డ నిధి నుంచి 18 ఏళ్లు నిండిన ప్రతి స్త్రీకి నెలకు 15000 రూపాయలు వస్తాయని నీరజ తెలిపారు.
దీపం పేరుతో ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా వస్తాయని
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని భరోసా ఇస్తూ 45వ డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకురాలు పి విమల గాయత్రి ఆధ్వర్యంలో ఇంటింటికి తిరుగుతూ ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నామని నీరజ తెలిపారు.
తెలుగు మహిళ మచిలీపట్నం నగర కార్పోరేషన్ అధ్యక్షురాలు, ఎన్ వసంత కుమారి మాట్లాడుతూ
తెలుగుదేశం పార్టీతోనే మహిళా సంక్షేమం సాధ్యం అని, డ్వాక్రా సంఘాల ద్వారా మహిళల అభివృద్ధికి కృషి చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదే అన్నారు . ఇంటింటికి తిరిగి టి.డి.పి. అందించబోయే సంక్షేమ పథకాలు వివరిస్తామని అన్నారు.
మచిలీపట్నం నగర కార్పోరేషన్ 45వ డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకురాలు, పి విమల గాయత్రి మాట్లాడుతూ
వైసీపీ పరిపాలనలో పేద, మధ్యతరగతి ప్రజలు ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నారని, ప్రజలు ప్రతినిత్యం ఉపయోగించే నిత్యవసర సరుకులు, కూరగాయల ధరలు కూడా అదుపు చేయలేని దుస్థితిలో ఈ వైసీపీ ప్రభుత్వం ఉండడం దుర్మార్గం కాద అన్నారు.
చెత్త పన్ను, కరెంటు చార్జీల పెంపు, గ్యాస్, పెట్రోల్, ధరల పెంపు, ఇలా ప్రతినిత్యం పేద, మధ్యతరగతి ప్రజలు ఉపయోగించే అన్నింటిపై వైసీపీ ప్రభుత్వం భారం మోపి ప్రజల నడ్డి విరుస్తోందని మండిపడ్డారు. వైసీపీ పరిపాలనను తరిమి కొడతానికి ప్రజల సిద్ధంగా ఉన్నారు అన్నారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కృష్ణాజిల్లా ప్రచార కార్యదర్శి, 45వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్, పి.వి. ఫణి కుమార్, తెలుగుదేశం పార్టీ నాయకులు, పామర్తి నరేష్, గంజాల రవికుమార్, కొల్లేరు సత్యనారాయణ లతోపాటుగా తెలుగుదేశం పార్టీ తెలుగు మహిళలు, కార్పోరేటర్ దేవరపల్లి అనిత, జొన్నలగడ్డ విజయలక్ష్మి, వేమూరి శ్రీదేవి, బలగం కృష్ణకుమారి, పాలమాని రాధా, న్యాయవాది ఎం గోవర్ధనమ్మ తదితరులు పాల్గొన్నారు.