బిహార్‌లో కొత్తగా ఏర్పడిన ’మహాగట్ బంధన్’ ప్రభుత్వం పై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆర్జేడీ`,జేడీయూ`, కాంగ్రెస్ ప్రభుత్వంపై జనాల్లో అంతగా ఆదరణ లేదన్నారు. నితీశ్ కుమార్ సీఎం కుర్చీకి ఫెవికల్ అంటించుకుని కూర్చుంటే.. మిగతా పార్టీలు ఆయన చుట్టు తిరుగుతున్నాయంటూ ఆరోపించారు. 75 వ స్వాతంత్య దినోత్సవం సందర్భంగా సీఎం నితీశ్ కుమార్ చేసిన ఉద్యోగాల ప్రకటన పై ప్రశాంత్ కిషోర్ స్పందించారు. వచ్చే ఏడాది లేదా రెండేండ్లలో ఈ ప్రభుత్వం ఐదు నుంచి పది లక్షల ఉద్యోగాలు కల్పిస్తే తన జన్ సురాజ్ అభియాన్‌ను ఆపేస్తానని, నితీశ్ కుమార్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తానని తెలిపారు. బుధవారం సమస్తిపూర్‌లో తన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసగించిన ప్రశాంత్ ఈ కామెంట్స్ చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోపు రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటాయని ఆయన జోస్యం చెప్పారు. బీజేపీతో తెగతెంపులు చేసుకున్న నితీశ్ కుమార్… ఆర్జేడీ, కాంగ్రెస్ లతో కలిసి బిహార్‌లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఎనిమిదో సారి బిహార్ సీఎంగా నితీశ్ కుమార్ వారం క్రితం ప్రమాణ స్వీకారం చేయగా,డిప్యూటీ సీఎంగా తేజస్వీ యాదవ్‌గా బాధ్యతలు స్వీకరించారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!