మాదాపూర్ డ్రగ్స్ కేసు డైలీ సీరియల్లా మలుపులు తిరుగుతోంది. మొన్న నవదీప్ విచారణ తర్వాత.. తాజాగా సినీ నిర్మాత కలహర్ రెడ్డి తెరపై ప్రత్యక్షమయ్యాడు. ఇన్నాళ్లు డ్రగ్స్ కేసులో ఆయన పేరు మార్మోగినా ఎక్కడా కనిపించకుండా వినిపించకుండా తగు జాగ్రత్తలు తీసుకున్న ఇతగాడు..ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు వెళ్లి భంగపాటుకు గురయ్యాడు.
మాదాపూర్ డ్రగ్స్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. పోలీసుల ముందు లొంగిపోయిన డ్రగ్స్ కేసు నిందితుడు, సినీ నిర్మాత కలహర్‌రెడ్డి విచారణ ముగిసింది. తనకు డ్రగ్స్ అలవాటు లేనే లేదట. అమ్మతోడు నమ్మండి సార్ అంటున్నాడు కలహర్. మాదాపూర్ డ్రగ్స్ కేసు డైలీ సీరియల్లా మలుపులు తిరుగుతోంది. మొన్న నవదీప్ విచారణ తర్వాత.. తాజాగా సినీ నిర్మాత కలహర్ రెడ్డి తెరపై ప్రత్యక్షమయ్యాడు. ఇన్నాళ్లు డ్రగ్స్ కేసులో ఆయన పేరు మార్మోగినా ఎక్కడా కనిపించకుండా వినిపించకుండా తగు జాగ్రత్తలు తీసుకున్న ఇతగాడు..ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు వెళ్లి భంగపాటుకు గురయ్యాడు.
కోర్టు ఆదేశాలతో పోలీసులకు లొంగిపోయిన ఆయనను గుడిమల్కాపూర్ పోలీసులు విచారించారు. డ్రగ్స్ కేసులో నిందితుడు కలహర్‌రెడ్డి విచారణ ముగిసింది. కలహర్రెడ్డిని 5 గంటల పాటు విచారించారు నార్కోటిక్ పోలీసులు. తనను మళ్లీ ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు వస్తానంటూ మీడియాకు తెలిపారు కలహర్. అమ్మతోడు తనకు డ్రగ్స్ అలవాటు లేనే లేదంటున్నారు ఈ పెద్దమనిషి. తనకు డ్రగ్స్ అలవాటు లేకపోతే పోలీసులు వేటాడి వెంటాడి విచారణకు ఎందుకు పిలిచారో మాత్రం ఇతగాడు బయటపెట్టలేదు. అలవాటు లేదనే విషయాన్ని మాత్రం కల్హరుడు కరాఖండిగా చెబుతున్నాడు.
హైకోర్టు ఆదేశాల మేరకు గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయానన్నారు ఆయన. డ్రగ్స్ కేసుతో సంబంధం లేదు కాబట్టే.. హైకోర్టును ఆశ్రయించానన్నారు ఆయన. మీడియాలో చూశాకే తనకు ఈ విషయాలన్నీ తెలిశాయని, అచ్చం నవదీప్ చెప్పినట్లే, అదే వెర్షన్ 2.0 వినిపించారు కలహర్. నార్కోటిక్ పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పానన్నారు. తన ఫోన్ లో వేల కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయని, అందులో దొంగలు, మంచివాళ్ళు ఉన్నారని కలహర్ పేర్కొన్నారు. తన కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్నవాళ్లలో కొందరు డ్రగ్ కన్జ్యూమర్స్ ఉన్నారని, అందుకనే తన పేరు కూడా లిస్టులో చేర్చారని ఆయన చెబుతున్నారు. తనకు మాదాపూర్ డ్రగ్స్ కేసుకు ఎలాంటి సంబంధం లేదంటున్నారు ఆయన. నార్కోటిక్ పోలీసుల విచారణకు పూర్తిగా సహకరించానని, తర్వాతకూడా సహకరిస్తానంటున్నారు కలహర్. చూడాలి మరి ఈ డ్రగ్స్ కేసులో ఇంకెంతమంది బయటకు వస్తారో..