కమెడియన్ సత్యం రాజేశ్, కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మా ఊరి పొలిమేర. కరోనా సమయంలో డైరెక్టుగా ఓటీటీలో రిలీజైన ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది. ఒక పల్లెటూరి నేపథ్యంలో క్షుద్ర పూజలు, బ్లాక్ మ్యాజిక్ చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. అయితే ఎవరూ ఊహించని ట్విస్టులతో ఎంతో ఆసక్తికరంగా సాగుతుందీ సినిమా
కమెడియన్ సత్యం రాజేశ్, కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మా ఊరి పొలిమేర. కరోనా సమయంలో డైరెక్టుగా ఓటీటీలో రిలీజైన ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది. ఒక పల్లెటూరి నేపథ్యంలో క్షుద్ర పూజలు, బ్లాక్ మ్యాజిక్ చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. అయితే ఎవరూ ఊహించని ట్విస్టులతో ఎంతో ఆసక్తికరంగా సాగుతుందీ సినిమా. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో నేరుగా విడుదలైన మా ఊరు పొలిమేర కొన్ని రోజుల పాటు ట్రెండింగ్‌లో ఉంది. ముఖ్యంగా కమెడియన్ సత్యం రాజేష్ యాక్టింగ్ అయితే వేరే లెవెల్. సినిమా ప్రారంభంలో ఎంతో అమాయకుడిగా కనిపించిన అతను ఆఖరిలో విలన్‌గా ఎవరూ ఊహించని ట్విస్ట్ ఇస్తాడు. దీనికి సూపర్ రెస్పాన్స్ రావడంతో సీక్వెల్‌ను కూడా అప్పుడే అనౌన్స్ చేశారు మేకర్స్. మా ఊరు పొలిమేర 2 షూటింగ్ కూడా పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకొంటోంది. ఇప్పటికేసినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ఈ థ్రిల్లింగ్ మూవీపై అంచనాలను అమాంతం పెంచేశాయి. తాజాగా ఈ సీక్వెల్ రిలీజ్ డేట్‌ను కూడా అనౌన్స్ చేశారు మేకర్స్. అయితే ఫస్ట్ పార్ట్‌కు సూపర్ రెస్పాన్స్ రావడంతో మా ఊరి పొలిమేర 2 ఓటీటీలో కాకుండా థియేటర్లలో సందడి చేయనుంది. నవంబర్ 3న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్.
డాక్టర్ అనిల్ విశ్వనాథ్ తెరకెక్కించిన మా ఊరు పొలిమేర సినిమాలో గెటప్ శీను, రాకేందు మౌళి, బాలాదిత్య, సాహిత్య దాసరి, రవివర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కాగా మా ఊరు పొలిమేర 2 సినిమాను జీఏ 2 బ్యానర్‌పై బన్నీ వాసు రెండు తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూట్ చేస్తుండడం విశేషం. కాబట్టి థియేటర్లలో పెద్ద ఎత్తున సినిమా రిలీజ్ కానుంది. కాగా మొదటి భాగం అంతా పల్లెటూరులోనే జరిగితే రెండో పార్ట్ షూటింగ్ మాత్రం పాడేరు, కేరళ, ఉత్తరాఖండ్‌లో షూటింగ్ చేశామంటున్నారు నిర్మాత గౌరీ కృష్ణ. మొదటి పార్ట్ కంటే రెండో భాగం మరింత థ్రిల్లింగ్ గా ఉంటుందంటున్నారు మేకర్స్..