డిసెంబర్ 08 (ఆంధ్రపత్రిక): రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్న లేటెస్ట్ సినిమా ’ధమాకా’. త్రినాథ్‌రావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ’క్రాక్’ వంటి మంచి హిట్ తర్వాత ’ఖిలాడీ’, ’రామారావు డ్యూటీ’లు బ్యాక్ టు బ్యాక్ ప్లాప్‌లు కావడంతో.. రవితేజ ఆశలన్నీ ఈ చిత్రంపైనే ఉన్నాయి. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్‌లు, టీజర్ సినిమాపై విపరీతమైన అంచనాలు నెలకొల్పాయి. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందింన ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 23న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం వరుస అప్‌డేట్‌లు ప్రకటిస్తూ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలోని దండకడియాల్ లిరికల్ సాంగ్ రిలీజైంది. లేటెస్ట్‌గా రిలీజైన ఈ మాస్ బీట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. రవితేజ ఎనర్జిటిక్ స్టెప్స్ ఫ్యాన్స్‌లో జోష్ నింపుతున్నాయి. భీమ్స్ సిసిరోలియో స్వర పరిచిన ఈ పాటను భీమ్స్‌తో పాటు సాహితి, మంగ్లీ ఆలపించారు. అంతేకాకుండా ఈ పాటకు భీమ్స్ స్వయంగా సాహిత్యం అందించాడు. ఇప్పటికే చిత్రం నుండి రిలీజైన పాటలన్ని చార్ట్ బస్టర్‌లుగా నిలిచాయి. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ ట్రాక్‌లోకి రావాలని రవితేజ కసితో ఉన్నాడు. ఈ చిత్రాన్ని పీపుల్ విూడియా, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. రవితేజ కెరీర్‌లోనే హైయెస్ట్ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందింది. రవితేజకు జోడీగా పెళ్ళి సందడి ఫేం శ్రీలీల నటిస్తుంది. ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ బెజవాడ కథ`స్క్రీన్‌ప్లే`మాటలు అందిస్తున్నాడు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!