కె.కోటపాడు,ఫిబ్రవరి16(ఆంధ్రపత్రిక):
మండలంలోని కొరువాడ గ్రామంలో విశాఖపట్నంఎల్. వి.ప్రసాద్ కంటి హాస్పటల్ వారు గురువారం ఉచిత నేత్ర వైద్య శిబిరంను నిర్వహించారు. క్యాంప్ కో-ఆర్డినేటర్ సోములు ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో 102 మందికి అప్తామెట్రిస్ట్ సీతారామం ఉచితంగా నేత్ర పరీక్షలు నిర్వహించారు. వీరిలో 22 మందినేత్ర రోగులకు కేటరాక్ట్ ఆపరేషన్ అవసరాన్ని నిర్ధారించారు. వీరికి హనుమంతవాకలో గల ఎల్.వి.ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ లో శుక్రవారం శస్త్ర చికిత్సలు చేస్తారని శిబిర నిర్వాహకులు తెలిపారు. మరో 20 మందికి కళ్లద్దాల అవసరాన్ని గుర్తించామన్నారు.ఈ శిబిరంలో సర్పంచ్ సింగంపల్లి నారాయణమూర్తి, విజన్ టెక్నీషియన్స్ ఎస్.సెహరాన్, కావేరి, స్వప్న, ఆప్టికల్ ల్యాబ్ టెక్నీషియన్ ధనాజీ, ఫీల్డ్ వర్కర్స్ గాంధీ, సంతోషి తదితరులు పాల్గొన్నారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!