నవంబర్ 05 (ఆంధ్రపత్రిక): యువ హీరో ఉదయ్ శంకర్ నటిస్తున్న కొత్త సినిమా ’నచ్చింది గర్ల్ ఫ్రెండూ’. జెన్నీ హీరోయిన్ గా నటిస్తోంది. మధునందన్ మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. కమర్షియల్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ మూవీని దర్శకుడు గురు పవన్ తెరకెక్కిస్తున్నారు. శ్రీరామ్ ఆర్ట్స్ బ్యానర్ పై అట్లూరి ఆర్ సౌజన్య సమర్పణలో.. అట్లూరి నారాయణ రావు నిర్మిస్తున్నారు. ఈ నెల 11న రిలీజ్ అవుతున్న ఈ మూవీ ట్రైలర్ ని విక్టరీ వెంకటేష్ శనివారం లాంఛ్ చేశారు. ఈ సందర్భంగా విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ: ’ట్రైలర్ చాలా బాగుంది. కాన్సెప్ట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. విజువల్స్ బాగున్నాయి. ఈసినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయని తెలిసింది. ఉదయ్ శంకర్ కి మంచి విజయం దక్కుతుందని ఆశిస్తున్నాను. టీం కి నా బెస్ట్ విషెష్ ’ అన్నారు. హీరో ఉదయ్ శంకర్ మాట్లాడుతూ: ’విక్టరీ వెంకటేష్ గారు మా ట్రైలర్‌ని లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఒక రోజు జరిగే కథ లో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. దోస్తీ సాంగ్.. ఎర్రతోలు పిల్ల సాంగ్స్ కి బాగా రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమా యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది. వెంకటేష్ గారు ట్రైలర్‌ని చూసి మా టీం ని అభినందించడం మాకు కొత్త ఎనర్జీని ఇచ్చింది’ . హీరోయిన్ జెన్నీఫర్ ఇమ్మానుయేల్ మాట్లాడుతూ: ’వెంకటేష్ గారు మా ట్రైలర్‌ని లాంఛ్ చేసినందుకు చాలా థ్యాంక్స్. మా సినిమా తప్పకుండా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. ఒన్ డే లో జరిగే ఈ లవ్ స్టోరీ లో చాలా ఎమోషన్స్ ఉన్నాయి’. అన్నారు. నిర్మాత అట్లూరి నారాయణ మాట్లాడుతూ: ’రామానాయుడు స్టూడియోస్ లో విక్టరీ వెంకటేష్ గారి చేతులు విూదుగా నచ్చింది గాళ్ ఫ్రెండూ ట్రైలర్ లాంఛ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. విక్టరీ వెంకటేష్ గారు మా ట్రైలర్ చూసి ఇచ్చిన ఫీడ్ బ్యాక్ మాకు చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది. యూత్ ఫుల్ కంటెంట్ గా రూపొందిన ఈ సినిమా ఈ నెల 11న రిలీజ్ కి సిద్దం అవుతుంది. తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్నాను’ అన్నారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!