న్యూఢిల్లీ: ఐదో విడత (Fifth Phase) లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) భాగంగా సోమవారంనాడు 49 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుగుతోంది.
మధ్యాహ్నం 1 గంట ప్రాంతానికి 36.73 శాతం పోలింగ్ నమోదైంది. లఢక్‌లో అత్యధికంగా 52.02 శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల కమిషన్ తెలిపింది.
ఈసీ వివరాల ప్రకారం, లఢక్ తర్వాత పశ్చిమబెంగాల్లో 48.41 శాతం, జార్ఖాండ్‌లో 41.89 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 39.55 శాతం, ఒడిశాలో 35.31 శాతం, జమ్మూకశ్మీర్‌లో 34.79 శాతం, మహారాష్ట్రలో 27.78 శాతం పోలింగ్ నమోదైంది. ముుంబైలో మందకొడిగా పోలింగ్ కొనసాగుతోంది. ముంబై నార్త్‌లో 26.78, ముంబై నార్త్ సెంట్రల్లో 28.05, ముంబై నార్త్ ఈస్ట్‌లో 28.82, ముంబై నార్త్ వెస్ట్‌లో 28.41 శాతం పోలింగ్ నమోదైంది. ముంబై సౌత్‌లో సైతం 28.41 శాతం, ముంబై సౌత్ సెంట్రల్లో 27.21 శాతం పోలింగ్ నమోదైంది. ఈ విడత ఎన్నికల్లో తమ అదృష్టం పరీక్షించుకుంటున్న ప్రముఖులల్లో రాహుల్ గాంధీ, బీజేపీ నేతలు రాజ్‌నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, రాజీవ్ ప్రతాప్ రూడీ, పీయూష్ గోయల్, ఉద్వల్ నికమ్, కరణ్ భూషణ్ సింగ్, ఎల్జేపీ నేత చిరాగ్ పాశ్వాన్, జేకేఎన్ఎస్ చీఫ్ ఒమర్ అబ్దుల్లా, ఆర్జేడీ నేత రోహిణి ఆచార్య తదితరులు ఉన్నారు.