అక్టోబర్ 31 (ఆంధ్రపత్రిక): సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా జంటగా మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన చిత్రం ’లైక్ షేర్ అండ్ సబ్స్కైబ్ర్’. వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ మూవీ నవంబర్ 4న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి నాని ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. నాని మాట్లాడుతూ ’నాతోపాటు సంతోష్ కూడా ఇంద్రగంటి మోహన్ కృష్ణ స్కూల్ నుంచే వచ్చాడు. చాలా మెచ్యూర్డ్ యాక్టర్. ప్రామిసింగ్ ప్రాజెక్టులు చేయడం సంతోషంగా ఉంది. ఫరియా ఫెంటాస్టిక్ హీరోయిన్. ఫస్ట్ సినిమాతోనే మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇందులో సంతోష్, ఫరియా పెయిర్ చాలా బాగుంది. ప్రేక్షకులు కచ్చితంగా సినిమాను లైక్ చేస్తారు’ అన్నాడు. ఇతర అతిథులు మారుతి, నందినీ రెడ్డి.. ’గాంధీ టైమింగ్ చాలా ఇష్టం’ అని చెప్పారు. సంతోష్ శోభన్ మాట్లాడుతూ ’నాని గారు ఈవెంట్‌కి రావడం ఆనందంగా ఉంది. ఆయన నుంచి చాలా నేర్చుకున్నా. మేర్లపాక గాంధీతో మళ్లీ మళ్లీ పనిచేయాలనుంది’ అన్నాడు. ’జాతిరత్నాలు తర్వాత ఇది నాకు చాలా స్పెషల్ ఫిల్మ్. గాంధీ ఫన్ టైమింగ్ బాగుంటుంది’ అని చెప్పింది ఫరియా. ’ఈ సినిమా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. థియేటర్స్‌లో ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు’ అన్నాడు గాంధీ. సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్స్ చెప్పారు నిర్మాత. నటులు బ్రహ్మాజీ, సుదర్శన్, మిర్చి కిరణ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!