ముక్కొల్లు నాగారం,( గూడూరు) అక్టోబర్ 13 ఆంధ్రపత్రిక.
జగన్మోహన్ రెడ్డిని మళ్లీ రెండవసారి ముఖ్యమంత్రిగా గెలిపించుకునేందుకు అఖిలాంధ్ర ప్రజానీకం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు.
రాష్ట్రంలోని ప్రజలంతా ఎంతో సంతోషంగా ఉన్నారని, భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సుస్థిరంగా,సుభిక్షంగా ఉంచే శక్తి జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఉందని ఆయనను మళ్లీ రెండవసారి ముఖ్యమంత్రిగా గెలిపించుకునేందుకు అఖిలాంధ్ర ప్రజానీకం ఉవ్విళ్లూరుతున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు.
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం శుక్రవారం కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గం లోని గూడూరు మండలం ముక్కొల్లు సచివాలయ పరిధిలోని ముక్కొల్లు గ్రామంలోని పెద్ద వీధిలో ఎంతో ఉత్సాహంగా ప్రారంభమైంది. ఆయన అధికారులతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రతి ఇంట్లో ఆ కుటుంబానికి వివిధ పథకాల ద్వారా అందిన ఆర్థిక సహాయం వివరాలను తెలియజేయడంతో పాటు స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొండిశెట్టి దుర్గాభవాని, గరికపాటి రామకృష్ణ, కర్రెడ్డి కస్తూరి, కోలపల్లి సత్యనారాయణ, వడ్డీ శివ నాగేశ్వరరావు, సమ్మెట పద్మ సుశీల, రొంపిచర్ల భక్త హనుమంతాచార్యులు, కొట్టు మురళి, అంబటి శ్రీనివాసరావు, వీర్ల శ్రీపతి, పోలపల్లి విజయలక్ష్మి తదితరుల ఇళ్లను మంత్రి సందర్శించారు.
ఈ సందర్భంగా పలువురి గ్రామస్తులతో మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ, గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి, సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి ప్రతి ఒక్కరినీ కలిసి వారి యోగ క్షేమాలతో పాటు ఇతర ఆర్థిక ప్రయోజనాల విషయమై వివరిచేందుకు ఉద్దేశించిన గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకుని,ఐక్యంగా మున్ముందుకు పయనిద్దామని మంత్రి జోగి రమేష్ అన్నారు.
మధ్యాహ్న భోజనానంతరం మంత్రి జోగి రమేష్ ముక్కొల్లు సచివాలయ పరిధిలోని నాగారం,దళిత వాడ, గండ్రం, షా అబ్దుల్లా పాలెం గ్రామాల్లో గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు.
ఈ కార్యక్రమం లో గూడూరు మండల జెడ్పిటీసి వేముల సురేష్ రంగబాబు, గూడూరు ఎంపిపి సంగా మధుసూదన రావు, ముక్కోల్లు ఎంపీటీసీ యర్రంశెట్టి శ్రీనివాసరావు, ముక్కోల్లు గ్రామ సర్పంచ్ సమ్మెట జయవర్ధన్, గూడూరు మండల పార్టీ అధ్యక్షుడు వర్ణం మహాలక్ష్మి నాయుడు ( పెదబాబు ), స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ కారుమంచి కామేశ్వరరావు, రాయవరం సర్పంచ్ నందం మల్లేశ్వరి రవికిరణ్,గూడూరు తహసీల్దార్ బి విజయ ప్రసాద్,డి.సుబ్బారావు, పంచాయతీరాజ్ ఏఈ లోయ హరిబాబు,వివిధ శాఖల అధికారులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.