కె.కోటపాడు,ఏప్రిల్16(ఆంధ్రపత్రిక):దేశసంపదను ఆదానీ, అంబానీలకు ధారాదత్తం చేస్తున్న మోడీ పాలనకు రాబోయే ఎన్నికల్లో స్వస్తి పలుకుదామని సి.పి.ఐ.జిల్లా కార్యదర్శి బాలేపల్లి వెంకటరమణ పిలుపునిచ్చారు. ఆదివారం ఇక్కడ కె.కోటపాడు, దేవరాపల్లి మండలాలకు సంబధించి “ప్రచారభేరి”ని అయన జెండాఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకివస్తే వందరోజుల్లో ధరలు తగ్గిస్తామని, ఏడాదికి రెండు కోట్లమంది నిరుద్యోగులకు ఉద్యోగాలిస్తామని, విదేశాల్లో దాచుకున్నవారి నల్లధనంను బయటపెడతామని, రైతులు ఆదాయం రెట్టింపు చేస్తామని కల్లబొల్లి కబుర్లతో అధికారంలో కొచ్చిన మోడీ కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా, విభజనహామీలు, విశాఖకు రైల్వేజోన్, వెనకబడినజిల్లాలకు అభివృద్ధినిధులు, విశాఖస్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విధానంరద్దు తదితర అంశాలపై మోడీ ప్రభుత్వాన్ని నిలదీసే ధైర్యం వైసీపీ ప్రభుత్వానికి లేకపోవడం మన దురదృష్ట కరమని వెంకటరమణ అన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శిలు రాజాన దొరబాబు, ఎం.రామునాయుడు, జిల్లా కార్యవర్గ సభ్యులు డి.సిహెచ్.క్రాంతి, మండల కార్యదర్శి గొర్లె దేముడుబాబు, నాయకులు రెడ్డి అప్పలనాయుడు, ఇల్లాకు రాము, సి.పి.ఎం. నాయకులు యర్రా దేముడు, గాడి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!