మచిలీపట్నం అక్టోబర్ 9 ఆంధ్ర పత్రిక.:
వచ్చే నవంబర్ 15వ తేదీ నుండి డిసెంబర్ 21వ తేదీ వరకు ఆడుదాం ఆంధ్ర పోటీలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా సంయుక్త కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్ పేర్కొన్నారు
సోమవారం ఉదయం కలెక్టరేట్లోని స్పందన సమావేశ మందిరంలో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ నుండి జిల్లాకు అందిన పలు రకాల క్రీడా సామాగ్రిని సంయుక్త కలెక్టర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సంయుక్త కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో వచ్చే నవంబర్ 15వ తేదీ నుండి ఆడుదాం ఆంధ్ర క్రీడల పోటీలు నిర్వహిస్తామన్నారు.
అందులో ముఖ్యంగా వాలీబాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ, క్రికెట్ వంటి పోటీలు ఉంటాయన్నారు.
తొలుత గ్రామ, వార్డు స్థాయిల్లో ఆ తర్వాత మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి , రాష్ట్ర స్థాయిలో పోటీలు ఉంటాయన్నారు.
గ్రామ, వార్డు సాయిల్లో జరిగే పోటీలకు క్రీడా సామాగ్రిని సరఫరా చేయడం జరుగుతుందన్నారు. మండల స్థాయిలో విజేతలైన వారికి ప్రత్యేక క్రీడా సామాగ్రిని బహుమతిగా అందజేస్తామన్నారు.
క్రికెట్,వాలీబాల్, కబడ్డీ, కోకో పోటీల్లో నియోజకవర్గస్థాయిలో విజేతలైన వారికి మొదటి బహుమతిగా 35 వేల రూపాయలు, రెండో బహుమతిగా 15 వేల రూపాయలు, మూడో బహుమతిగా 5 వేల రూపాయలు అందజేస్తామన్నారు.
అలాగే జిల్లా స్థాయిలో మొదటి బహుమతిగా 60 వేల రూపాయలు, రెండవ బహుమతిగా 30 వేల రూపాయలు, మూడవ బహుమతిగా 10 వేల రూపాయలు ఉంటుందన్నారు.
అలాగే రాష్ట్రస్థాయిలో మొదటి బహుమతిగా 5 లక్షల రూపాయలు, రెండవ బహుమతిగా 3 లక్షల రూపాయలు, మూడవ బహుమతిగా 2 లక్షల రూపాయలు అందజేయడం జరుగుతుందన్నారు.
అదేవిధంగా బ్యాడ్మింటన్ పోటీల్లో నియోజకవర్గ స్థాయిలో విజేతలైన వారికి మొదటి బహుమతిగా 20 వేల రూపాయలు, రెండవ బహుమతిగా 10 వేల రూపాయలు, మూడవ బహుమతిగా 5వేల రూపాయలు అందజేస్తామన్నారు.
జిల్లాస్థాయిలో మొదటి బహుమతిగా 35వేల రూపాయలు, రెండవ బహుమతిగా 20 వేల రూపాయలు, మూడవ బహుమతిగా 10 వేల రూపాయలు అందజేస్తామన్నారు. రాష్ట్రస్థాయిలో మొదటి బహుమతిగా 2 లక్షల రూపాయలు, రెండవ బహుమతిగా 1 లక్ష రూపాయలు, మూడవ బహుమతిగా 50 వేల రూపాయలు అందజేస్తారన్నారు.
జిల్లాలోని ఆసక్తిగల క్రీడాకారులందరూ కూడా ఆడుదాం ఆంధ్ర పోటీలలో పాల్గొనాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ చీఫ్ కోచ్ ఝాన్సీ, మచిలీపట్నం ఆర్డిఓ శివ నారాయణ రెడ్డి పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.