వేపాడ, నవంబర్,17( ఆంధ్ర పత్రిక ):-
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న ఆడదాం ఆంధ్ర క్రీడా పోటీలకు క్రీడాకారులను సన్నద్ధం చేయాలని జిల్లా సెట్విజ్ సీఈఓ రామ్ గోపాల్ సచివాలయ ఉద్యోగులకు సూచించారు.మండల కేంద్రం వేపాడ మండల పరిషత్ కార్యాలయంలో సచివాలయ ఉద్యోగులకు ఆడుదాం ఆంధ్ర క్రీడ పోటీల నిర్వహణపై గురువారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రామ్ గోపాల్ మాట్లాడుతూ వాలీబాల్,ఖోఖో,బ్యాట్మెంటన్,కబడ్డీ,క్రికెట్ క్రీడా పోటీలు మాత్రమే నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.15 ఏళ్లు దాటిన యువతి యువకులకు వేరువేరుగా క్రీడలు నిర్వహించాలని ఒక్కో క్రీడాకారుడు రెండు క్రీడల్లో మాత్రమే పాల్గొనే అవకాశం ఉందన్నారు.సచివాలయ స్థాయిలో క్రీడలు నిర్వహించి అక్కడగెలుపొందినవారుమండల,నియోజకవర్గ,జిల్లా,రాష్ట్రస్థాయిలో పాల్గొంటారన్నారు.సచివాలయ,మండల స్థాయిలో పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు ఎటువంటి పారితోషకం ఇవ్వరని,నియోజకవర్గ,జిల్లా, రాష్ట్రస్థాయిలో పాల్గొనే క్రీడాకారులకు నగదు పారితోషకం చెప్పారు.క్రీడాకారులు తమ సచివాలయాల్లో ముందుగా వారి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ విస్తరణ అధికారి ఉమా,డిస్ట్రిక్ట్ కోచ్ శ్రీనివాసరావు,వేపాడ వ్యాయామ ఉపాధ్యాయులు దుల్ల ప్రసాద్, మిగతా వ్యాయామ ఉపాధ్యాయులు, పంచాయతీ కార్యదర్శులు,వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.