అమరావతి,అక్టోబర్6(ఆంధ్రపత్రిక): రాష్ట్రంలో పన్ను వసూ ళ్లలో లీకేజీలను అరికట్టడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆదాయ ఆర్జన శాఖలపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఈ ఆర్థిక సంవ త్సరం ప్రథమార్థంలో ఆదాయాల ప్రగతి ఆశాజనకంగా ఉందని అధికారులు సీఎం జగన్కు తెలిపారు. 94.47శాతం లక్ష్యం చేరుకున్నట్టు వెల్లడిరచారు. దేశ సగ టుతో పోలిస్తే రాష్ట్రంలో అధికంగా జీఎస్టీ వసూళ్లు ఉన్నా యన్నారు. పారదర్శక, సులభతర విధానాల ద్వారా చెల్లింపుదారులకు సౌలభ్యంగా ఉండాలన్నారు. రిజిస్ట్రేషన్ పక్రియలో పారదర్శక, సులభతర విధానాలపై కమిటీని సీఎం ఏర్పాటు చేశారు. నాటు సారా తయారీయే వృత్తిగా ఉన్న వారికి ప్రత్యామ్నాయ జీవనోపాధి చూపించాలని అధికారులను ఆదేశించారు. అనుమతులు పొందిన లీజు దారులు మైనింగ్ నిర్వ హించేలా చర్యలు తీసుకో వాలని స్పష్టం చేశారు. వారికేమైనా ఇబ్బందులు ఉంటే పరిష్కరించేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. రవాణాశాఖలో ఆదాయాల పెంపుపై చర్యలు తీసుకోవాలన్నారు. ఏపీ ఆదాయ వనరులు గాడిలో పడ్డాయని సీఎం అన్నారు. దేశ సగటుతో పోలిస్తే ఏపీలో అధికంగా జీఎస్టీ సగటు వసూళ్లు చేస్తున్నారని చెప్పారు. పన్ను వసూళ్లలో లీకేజీలను అరికట్టడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. రిజిస్టేష్రన్ పక్రియలో పారదర్శక, సులభతర విధానాలపై కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. రవాణా శాఖలో ఆదాయాల పెంపుపై చర్యలు తీసుకోవాలని అన్నారు. పారదర్శక, సులభతర విధానాల ద్వారా చెల్లింపుదారులకు సౌలభ్యంగా ఉండాల న్నారు. సవిూక్షలో మంత్రిపెద్దిరెడ్ఇ, సిఎస్ ఇతరఅధికారులు పాల్గొన్నారు.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!