AP Latest Weather Report: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి..
ఏపీలోని పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన విషయం విదితమే కాగా.. వాయుగుండం, దాని ప్రభావంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తాజా నివేదిక వెల్లడించింది.. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం .. పశ్చిమ-వాయువ్య దిశగా ఒడిశా, ఛత్తీస్గఢ్ మీదుగా కదులుతుందని.. వచ్చే 24 గంటల్లో క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని పేర్కొంది.ఇక, వాయుగుడం ప్రభావంతో.. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ.. ఏలూరు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెబుతుంది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని.. కర్నూలు అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది..
మరోవైపు.. సహాయక చర్యల కోసం 3 ఎస్డీఆర్ఎఫ్, 2 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉంచినట్టు తెలిపింది ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ.. వరద ప్రవహిస్తున్న వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని ప్రజలను హెచ్చరించింది.. మరోవైపు.. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.