నూజివీడు ; నూజివీడు మండలం గొల్లపల్లి గ్రామంలో స్వయంభూగా వేంచేసియున్న శ్రీ రఘునాథ స్వామి వారి ఆలయ పరిధిలోని భూములలో సాగులో ఉన్న చిన్న కారు రైతాంగానికి భూ హక్కులు కల్పించాలని రైతాంగం ఆందోళన చేపట్టారు. ఈ మేరకు గొల్లపల్లి గ్రామంలోని ఎండోమెంట్ కార్యాలయంలో ఈవో ఎల్లాప్రగడ విశ్వేశ్వరరావు కు శుక్రవారం వినతి పత్రం అందించారు. వేంపాడు అగ్రహారంలో ఉన్న శ్రీ రఘునాథ స్వామి వారి భూములు సాగు చేస్తున్న సన్నాయి చిన్న కారు రైతాంగం రామ దండుగా ఏర్పడి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా రైతులు ఒరుగు శ్రీరంగం, పానుగంటి నాగేశ్వరరావు లు మాట్లాడుతూ బడా భూస్వాములకు వందలాది ఎకరాలకు భూ హక్కులు కల్పించి, పట్టాదారు పాసుపుస్తకాలు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. నిజమైన సాగుదారులుగా ఉన్న సన్న చిన్న కారు రైతులకు భూ హక్కులు కల్పించాలంటే నియమ నిబంధనలు అడ్డువస్తున్నాయని అధికారులు కుంటి సాకు చెప్పడం తగదన్నారు. స్థానికేతరులైన కబ్జాదారులు బినామీ వ్యక్తులతో సాగు చేయిస్తూ, పట్టాలు అధికారులు ఎలా మంజూరు చేశారని రైతన్నలు ముక్తకంఠంతో ప్రశ్నిస్తున్నారు. స్వామివారిని నమ్ముకుని సాగు చేస్తున్న భూములలో తమకు హక్కులు కల్పించే వరకు ఆందోళన విరమించేది లేదని వారు స్పష్టం చేస్తున్నారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!