వేపాడ,నవంబర్,28( ఆంధ్ర పత్రిక ):-
కార్తీక మాస పౌర్ణమి సందర్భంగా మండలంలోని జగ్గయ్యపేట గ్రామంలో బుధవారం రాత్రి 7:00 నుండి 10:30 వరకు లక్ష బిల్వార్చన,లక్ష దీపారాధన పూజలు వైభవో పేతంగా నిర్వహించారు.ఈ ప్రాంత గురుస్వామి, గ్రామ పురోహితులు కీర్తిశేషులు లట్టాల హరి శర్మ కుమారుడు లట్టాల అయ్యప్ప స్వామి సారధ్యంలో నిర్వహించే ఈ పూజా కార్యక్రమంలో జగ్గయ్యపేట,సింగరాయి కొత్త సింగరాయి,గుడివాడ,అరిగి పాలెం,కరకవలస తదితర గ్రామాలకు చెందిన వందలాది మంది మహిళా భక్తులు,అయ్యప్ప మాలదారులు పాల్గొని లక్ష బిల్వార్చన,లక్ష దీపారాధన పూజా కార్యక్రమాలను నిర్వహించుకున్నారు.ముందుగా 6గంటల నుండి గణపతి పూజ,పుణ్యా వచనం, నమగ్ర మండపారాధన అనంతరం పరమశివునికి ప్రీతికరమైన బిల్వార్చనతో లక్ష బిల్వార్చన మరియు లక్ష దీపారాధన పూజలను నిర్వహించారు.
.