ఏడు జిల్లాలకు ప్రధాన వైద్య కేంద్రమైన కర్నూలు సర్వజన ఆస్పత్రిలో ఏం జరుగుతోంది? రోగులకు అత్యంత కీలకమైన ఎంఆర్ఐ, సిటీ స్కాన్ సెంటర్లను అధికారులు ఎందుకు సీజ్ చేశారు? రోగులు పడుతోన్న బాధలు.. ఈ వివరాల్లోకెళ్తే.. కర్నూలులోని ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఏడు జిల్లాలకు అతి కీలకమైన ప్రభుత్వ ఆసుపత్రి. ఉమ్మడి కర్నూలు జిల్లాతో పాటు అనంతపురం, కడప, ప్రకాశం, బళ్ళారి, మహబూబ్నగర్, రాయచూరు జిల్లాల నుంచి నిత్యం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి వైద్యం కోసం రోగులు వస్తుంటారు. ఎమ్మారై, సిటీ స్కాన్ అనేటివి కీలకమైనవి ఖరీదైనవి కూడా. వీటి ద్వారా రోగి స్థితిని..
ఏడు జిల్లాలకు ప్రధాన వైద్య కేంద్రమైన కర్నూలు సర్వజన ఆస్పత్రిలో ఏం జరుగుతోంది? రోగులకు అత్యంత కీలకమైన ఎంఆర్ఐ, సిటీ స్కాన్ సెంటర్లను అధికారులు ఎందుకు సీజ్ చేశారు? రోగులు పడుతోన్న బాధలు.. ఈ వివరాల్లోకెళ్తే.. కర్నూలులోని ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఏడు జిల్లాలకు అతి కీలకమైన ప్రభుత్వ ఆసుపత్రి. ఉమ్మడి కర్నూలు జిల్లాతో పాటు అనంతపురం, కడప, ప్రకాశం, బళ్ళారి, మహబూబ్నగర్, రాయచూరు జిల్లాల నుంచి నిత్యం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి వైద్యం కోసం రోగులు వస్తుంటారు. ఎమ్మారై, సిటీ స్కాన్ అనేటివి కీలకమైనవి ఖరీదైనవి కూడా. వీటి ద్వారా రోగి స్థితిని తెలుసుకునేందుకు ప్రభుత్వం ప్రైవేటుకు అప్పగించింది. ఎమ్మారై సెంటర్ ని ప్రమోదిని సంస్థకి, సిటీ స్కాన్ సెంటర్ ని SL డయాగ్నస్టిక్ సెంటర్ కి ప్రభుత్వం అప్పగించింది. ఒక రోగికి ఒక ఎమ్మారైలేదా సిటీ స్కాన్ చేస్తే కొంత మొత్తాన్ని ప్రభుత్వము ఆయా సంస్థలకు చెల్లిస్తోంది. ఒక్కొక్క ఎమ్మారై లేదా సిటీ స్కాన్ కి ఎంత అనేది అధికారులు బయటకు చెప్పడం లేదు. మిషన్లు ఏర్పాటు చేయడం వాటి నిర్వహణ కరెంటు బిల్లులు ఇతర ఖర్చులు అన్నీ ఆ సంస్థలు భరించాలి.
కానీ గత నాలుగు సంవత్సరాలుగా ఆ సంస్థలు కరెంటు బిల్లులు చెల్లించలేదు. రెండు సంస్థలు కలిపి 70 లక్షల పైగా విద్యుత్ బకాయిలు ఉన్నాయి. ఆసుపత్రి అధికారులు జిల్లా కలెక్టర్ సహా ఎన్నోసార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ ఆ సంస్థలు స్పందించడం లేదు. పైగా ఎమ్మారై సిటీ స్కాన్ కేసులు వాస్తవాని కంటే ఎక్కువగా చేసినట్లు చూపించి ఎక్కువ మొత్తంలో డబ్బులు డ్రా చేస్తున్నట్లు కూడా కలెక్టర్ డాక్టర్ జి సృజన, హాస్పిటల్ సూపరిండెంట్ లు డాక్టర్ వెంకట రంగారెడ్డి, డాక్టర్ ప్రభాకర్ రెడ్డి ల దృష్టికి వచ్చింది. ఏదో పెద్ద గోల్మాల్ జరుగుతున్నట్లుగా కూడా అధికారుల దృష్టికి వచ్చింది. దీనిపై మొత్తం విచారణ జరగాలని, భావించి ఆ రెండింటిని సీజ్ చేశారు. దీంతో సిటీ స్కాన్ ఎమ్మారై చేయించుకోవాల్సిన రోగుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. రోగులు ఇబ్బంది పడకుండాప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు చేసినట్లు కలెక్టర్ సృజన సూపరింటెండెంట్ లు వెంకట రంగారెడ్డి ప్రభాకర్ రెడ్డి లు తెలిపారు.
వాస్తవంగా రాత్రింబవళ్లు సిటీ స్కాన్, ఎమ్మారైలు చేయరు. 24 గంటలు రౌండ్ ది ఇయర్ పనిచేసిన కూడా 48 కేసులకు మించి చేయలేరు. కానీ రోజుకు 100 కేసులు చేసినట్లు రికార్డుల్లో చూపించి డబ్బులు డ్రా చేసుకుంటున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది దీనిపై కూడా ఇంటర్నల్ గా విచారణ జరుగుతున్నట్లు సమాచారం. పైగా గత కొన్నేళ్లుగా చెల్లించాల్సిన కరెంటు బకాయిలు చెల్లించకపోవడం కూడా ఈ ప్రైవేట్ సంస్థల దోపిడీకి నిదర్శనంగా భావిస్తున్నారు. సిటీ స్కాన్ ఎమ్మారై సేవలు ప్రభుత్వ ఆసుపత్రిలో నిలిచిపోవడంతో వివిధ ప్రజా సంఘాలు ధర్నా చేసేయి. వెంటనే ప్రత్యామ్నాయ మార్గం చూడాలని డిమాండ్ చేశాయి. ఇదే రేట్ల ప్రకారం ఇతర డయాగ్నస్టిక్ సెంటర్ ల నుంచిఎమ్మారై సిటీ స్కాన్ సేవలు రోగులకు అందిస్తామని అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి రోగులకు ఇబ్బంది లేకుండా చూస్తున్నామని శాశ్వత పరిష్కారం దిశగా ఆలోచిస్తున్నామని కలెక్టర్ డాక్టర్ జి సృజన టీవీ9 సీనియర్ కరస్పాండెంట్ నాగిరెడ్డి తో తెలిపారు.