నవంబర్ 07 (ఆంధ్రపత్రిక): విడుదలను జూన్ 23కు మార్చినట్లు ఓం రౌత్ ప్రకటన
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ’ఆదిపురుష్’ భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా తెరకెక్కింది. దాదాపు రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించాడు. గత కొన్ని నెలల క్రితం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని 2023 సంక్రాంతికి విడుదల చేయాలని మూవీ టీం భావించింది. దాని కోసం కొన్ని రోజుల క్రితం చిత్ర టీజర్‌ని కూడా విడుదల చేసింది. అయితే.. ఆ టీజర్‌ని చూసిన చాలామంది డిస్సపాయింట్ అయ్యారు. గ్రాఫిక్స్ దగ్గర నుంచి ప్రభాస్ లుక్ దగ్గర నుంచి సైఫ్ లుక్ వరకు చాలా విషయాల్లో విమర్శలు చేశారు. దీంతో చిత్ర విడుదలపై మూవీ టీం పునరాలోచనలో పడిరది. అందుకే ఇటీవలే పోస్ట్ పోన్ చేసినట్లు ప్రకటించింది. తాజాగా ఈ మూవీ ఎప్పుడు థియేటర్స్‌లోకి రానుందో దర్శకుడు ఓం రౌత్ సోషల్ విూడియా వేదికగా ప్రకటించాడు. ఓం రౌత్ షేర్ చేసిన పోస్ట్‌లో.. ‘జూన్ 16న ఆదిపురుష్ థియేటర్స్‌లోకి రానుంది‘ అని రాసుకొచ్చాడు. అలాగే దానికి ఓ ’జై శ్రీరామ్’ అంటూ ఓ ప్రకటనని కూడా విడుదల చేశాడు. అందులో.. ’ఆదిపురుష్ కేవలం సినిమా కాదు. అది శ్రీరాముడిపై మనకి ఉన్న భక్తి. మన సంస్కృతి, సంప్రదాయాలపై మనకి ఉన్న గౌరవం. ప్రేక్షకులకి పూర్తి స్థాయి విజువల్ అనుభూతిని ఇవ్వడానికి.. గ్రాఫిక్స్ టీంకి దానిపై పని చేయడానికి ఎక్కువగా సమయం కావాలి. అందుకే ఆదిపురుష్ జూన్ 16, 2023న విడుదల అవుతుంది. భారతదేశాన్ని గర్వంగా ఫీల్ అయ్యేలా చేసే సినిమా తీయడానికి నిబద్ధులమై ఉన్నాం. విూ సపోర్టు, ప్రేమ, ఆశీర్వాదాలు మాకు కావాలి. ఓం రౌత్’ అని రాసుకొచ్చాడు. ఈ పోస్ట్ చూసిన చాలా మంది ప్రభాస్ ఫ్యాన్స్ ’మరి జూన్‌లోనా’ అంటూ తమ బాధని వ్యక్తం చేస్తున్నారు. అలాగే.. ఈ సారైనా వీఎఫ్ఎక్స్ బాగా చేయమని మరికొందరు రిక్వెస్ట్ చేస్తున్నారు. కాగా.. ఈ మూవీలో సీతగా కృతి సనన్ (ఐసతిబితి ªూజీనినీని), రావణ్‌గా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!