7,601 మంది రైతులకు రు.5.70 కోట్ల పెట్టుబడి సాయం..!
ఉద్యాన పంటలు సాగు చేస్తున్న 211 మంది రైతులకు 21.62 లక్షలు ఇన్పుట్ సబ్సిడీ పంపిణీ..!
మచిలీపట్నం సెప్టెంబర్ 1 ఆంధ్ర పత్రిక.:
పేద రైతులకు అండగా నిలబడి పెట్టుబడి సాయం అందించేందుకు వైయస్సార్ రైతు భరోసా ప్రభుత్వం అమలు చేస్తోందని కృష్ణా జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు అన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి వైయస్సార్ రైతు భరోసా పిఎం కిసాన్ పథకం కింద భూమిలేని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కౌలు రైతులకు పెట్టుబడి సాయం బటన్ నొక్కి వారి ఖాతాలో జమ చేశారు. కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ ఈ కార్యక్రమం వీసీ లో పాల్గొన్నారు.
అనంతరం జిల్లాలో వైయస్సార్ రైతు భరోసా- పిఎం కిసాన్ పథకం క్రింద 5వ ఏడాది మొదటి విడతగా 7,462 మంది భూమిలేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కౌలు రైతులు మరియు దేవాదాయ భూములు సాగు చేసుకుంటున్న 139 మంది కౌలు రైతులు మొత్తం 7,601 మంది రైతులకు 7,500 చొప్పున పెట్టుబడి సాయంగా మొత్తం 5.70 కోట్ల రూపాయలు,
2023 ఖరీఫ్ లో మే నుండి ఆగస్టు వరకు కురిసిన భారి వర్షాలు వరదలకు ఉద్యాన పంటలు దెబ్బతిన్న 211 మంది రైతులకు రు.21.61 లక్షలు కలెక్టర్ పంపిణీ గావించారు.
కలెక్టర్ రాజా బాబు మాట్లాడుతూ పేద రైతులకు పంట సాగు ప్రారంభంలోనే ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద అందిస్తున్న పెట్టుబడి సాయం సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
లబ్ధి పొందిన రైతుల అభిప్రాయాలు.. !
చల్లపల్లి మండలం నడకుదురు శివారు రాముడు పాలెం గ్రామానికి చెందిన రైతు కొర్రపాటి వీరసింహుడు మాట్లాడుతూ గత మేనెల ఆగస్టు మధ్యలో కురిసిన భారీ వర్షాలు వరదలకు తాను సాగు చేస్తున్న అరటి పంట దెబ్బతిందని, వ్యవసాయ అధికారులు పంట నష్టం నమోదు చేసుకున్నారని తెలిపారు ప్రభుత్వం ఈ సీజన్ లోనే 14,250 రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ మంజూరు చేసిందని చాలా సంతోషంగా ఉందని ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. మచిలీపట్నం శారద నగర్ కు చెందిన రైతు గోతాటి గంగాధర్ రావు మాట్లాడుతూ పంటల సాగు ప్రారంభించడానికి ముందుగా పెట్టుబడి సాయం అందిస్తున్న జగనన్నకు ధన్యవాదాలు తెలిపారు మాలాంటి పేద కౌలు రైతులకు ఈ సాయం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి కమిటీ చైర్మన్ జన్ను రాఘవరావు, కమిటీ సభ్యులు శ్రీకాకుళపు నాగేశ్వరరావు, బందరు నియోజకవర్గ వ్యవసాయ సలహా కమిటీ చైర్మన్ చూడామణి రావు, వ్యవసాయాధికారులు ఎస్. మనోహరరావు, మణిధర్, ఉద్యాన శాఖ అధికారి చందు లబ్ధిదారులైన రైతులు పాల్గొన్నారు.