Korea Open: గిన్నిస్ రికార్డును బద్దలు కొట్టిన తెలుగు ఆటగాడు సాత్విక్ సాయిరాజ్
కొరియా ఓపెన్‌లో తెలుగు ఆటగాడు సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డును బద్దలుకొట్టాడు. థాయ్‌లాండ్‌కు చెందిన సుపాక్ జోమ్కోహ్- కిట్టినుపాంగ్ కేడ్రెన్‌ల జోడీతో జరిగిన ప్రారంభ మ్యాచ్ పురుషుల విభాగంలో ఫాస్టెస్ట్ హిట్ కొట్టిన ఆటగాడిగా సాత్విక్ గిన్నిస్ రికార్డును సృష్టించాడు.
కొరియా ఓపెన్‌లో తెలుగు ఆటగాడు సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డును బద్దలుకొట్టాడు. థాయ్‌లాండ్‌కు చెందిన సుపాక్ జోమ్కోహ్- కిట్టినుపాంగ్ కేడ్రెన్‌ల జోడీతో జరిగిన ప్రారంభ మ్యాచ్ పురుషుల విభాగంలో ఫాస్టెస్ట్ హిట్ కొట్టిన ఆటగాడిగా సాత్విక్ గిన్నిస్ రికార్డును సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో 22 ఏళ్ల సాత్విక్ గంటకు ఏకంగా 565 కి.మీ వేగంతో స్మాష్ హిట్ కొట్టాడు. దీంతో పరుషుల బ్యాడ్మింటన్‌లో అత్యంత వేగంతో కొట్టిన స్మాష్ హిట్‌గా ఇది గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డులకెక్కింది. ఈ క్రమంలో గతంలో మలేషియాకు చెందిన టాన్ బూన్ హియాంగ్ పేరు మీద ఉన్న పదేళ్ల రికార్డును సాత్విక్ బద్దలుకొట్టాడు. 2013 మేలో టాన్ బూన్ హియోంగ్ గంటకు 493 కిలో మీటర్ల వేగంతో హిట్ కొట్టాడు. ఇది అప్పట్లో గిన్నిస్ రికార్డులకెక్కింది. పదేళ్ల పాటు హియోంగ్ పేరు మీదనే ఈ రికార్డు ఉంది. తాజాగా అమలాపురం ఆటగాడు సాత్విక్‌సాయిరాజ్ రాంకిరెడ్డి ఆ రికార్డును బ్రేక్ చేశాడు.