-
-
Komatireddy Venkatareddy నా ముందు ఎలాంటి ఆప్షన్స్ లేవు
-
తనపై ఫేక్ న్యూస్ ప్రసారమవుతోందని భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.

హైదరాబాద్ : తనపై ఫేక్ న్యూస్ ప్రసారమవుతోందని భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ మార్పు వార్తలను ఖండించారు. తాను పార్టీ మారుతున్నానని వస్తున్న వార్తలను నమ్మవద్దని సూచించారు. ఫేక్ న్యూస్ ప్రచారం చేయడం కరెక్ట్ కాదన్నారు. తాను అధికారికంగా ప్రకటించేందుకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. తాను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నాననడం తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. మొన్న రాహుల్ గాంధీ అనర్హతను నిరసిస్తూ గాంధీభవన్‌లో చేసిన దీక్షలో పాల్గొన్నారు. భువనగిరి నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు పాల్గొంటున్నానన్నారు. తన ముందు ఎలాంటి ఆప్షన్స్ లేవన్నారు. తనది కాంగ్రెస్ రక్తమని కోమటిరెడ్డి తెలిపారు.