ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు
డుంబ్రిగుడ ఫిబ్రవరి 9(ఆంధ్ర పత్రిక) మండల కేంద్రంలో పరిధిగల కొల్లాపూటు పంచాయితీ పరిధి 16 గ్రామాలకు వీధి దీపాల కొరతతో అయ గ్రామ గిరిజనులు రాత్రిపూట బయటకు రావటం చాలా భయాందోళన కలిగిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గ్రామాలకు సంబంధించి వీధిలైట్లు విద్యుత్ స్తంభాలకు లేకపోవడంతో గ్రామాలకు చిమ్మ చీకటితో ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు.రాత్రిపూట సమయంలో చిన్నచిన్న విష జంతువులు చంచరిస్తుంటాయని స్థానిక వాసులు స్థానిక విలేకరుల ముందు వారి గోడు వెలబుచ్చారు.ఇంటి పన్ను సకాలంలో వసులు చేస్తున్నప్పటికీ నేటికీ వీధిలైట్లు వేయకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.ఈ విషయంపై అధికారులు స్పందించి వీధిలైట్లు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.