రాజమండ్రి జైలు నుంచి శ్రీనివాస్ విచారణ
విజయవాడ,ఏప్రిల్27(ఆంధ్రపత్రిక): కోడికత్తి కేసు విచారణ మే 10వ తేదీకి వాయిదా పడిరది. నిందితుడు శ్రీనివాస్ ను రాజమండ్రి జైలు నుంచి వీడియో కాల్లో ఎన్ఐఏ కోర్టు విచారించింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని గతంలో సీఎం జగన్ పిటిషన్ దాఖలు చేశారు. అడ్వకేట్ కమిషనర్‌ను నియమించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టాలని అభ్యర్ధించారు. అయితే ఈ రోజు కీలకమైన విచారణ జరుగుతుందని భావించినప్పటికీ.. తాత్కాలిక న్యాయమూర్తి కావడం.. పూర్తి స్థాయిలో బాధ్యతలు స్వీకరించకపోవడంతో కేసును వాయిదా వేశారు. ప్రధానంగా సీఎం జగన్ రెండు పిటిషన్లు దాఖలు చేశారు. తాను కోర్టుకు హాజరు కాలేనని పేర్కొంటూ ఒక పిటిషన్.. దానికి సంబంధించి అడ్వకేట్ కమిషనర్‌ను ఏర్పాటు చేసి విచారించాలని కోరారు. దీనిపై ఇప్పటికే నిందితుడి తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై ఇవాళ వాదనలు జరగాల్సి ఉంది. అదే సమయంలో మరో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఎన్ఐఏ పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి విచారణ జరపలేదని, పూర్తి స్థాయిలో మరొకసారి ఈ కేసుపై విచారణ చేయాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. ఈ రెండు పిటిషన్లపై ఈరోజు విచారణ జరుగుతుందని అంతా భావించారు. అయితే ఈ కేసు విచారణ చేసిన న్యాయమూర్తి ప్రమోషన్‌పై కడప జిల్లా కోర్టుకు బదిలీ అయిన నేపథ్యంలో ఆ స్థానంలో వచ్చిన తాత్కాలిక న్యాయమూర్తి.. పూర్తి స్థాయిలో బాధ్యతలు స్వీకరించిన తర్వాత విచారిస్తానని పేర్కొంటూ కేసును మే 10వ తేదీకి వాయిదా వేశారు.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!