సైబర్ క్రైం, ఆన్లైన్ నేరాలు ప్రస్తుతం కాలంలో సాధారణం అయిపోయాయి. పెరుగుతున్న టెక్నాలజీ సామాన్యులకు ఎంత మేలుచేస్తుందో.. సైబర్ నేరగాళ్లకు కూడా అంతే ఎత్తున అవకాశాలు కల్పిస్తోంది. టెక్నాలజీ సాయంతో ప్రజలని బాధితులకు మారుస్తున్నారు. తెలిసో తెలియకో నేరగాళ్ల మాటలు నమ్మి, అత్యాశకు పోయి మోసపోతున్నారు. అయితే ఓ వ్యాపారవేత్త తాజాగా తనకు ఎదురైన ఓ ఘటనను సోషల్‌మీడియా వేదికగావెల్లడించారు.
బెంగళూరుకు చెందిన SALT సంస్థ సహ వ్యవస్థాపకురాలు ఉదితా పాల్ ఓ పోస్టు చేశారు. సైబర్ నేరగాడు తన వద్ద నుంచి డబ్బు కాజేసేందుకు యత్నించిన తీరును, తాను స్పందించిన విధానాన్ని స్క్రీన్ షాట్లతో సహా వివరించారు. ఈ ట్వీట్‌పై వేలాది మంది వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.మహిళా వ్యాపారవేత్త ఉదితా పాల్‌కు కొత్త నంబర్ నుంచి వాట్సాప్ మెసేజ్ వచ్చింది. అందులో దేవికర్గా పరిచయం చేసుకున్న సైబర్ నేరగాడు.. తాను ప్రస్తుతం ముంబయిలో నివాసం ఉంటున్నట్లు తెలిపాడు. తనకు కొంత సమయం ఇవ్వాలని కోరుతాడు.తన వద్ద ఓ ఉద్యోగం ఉందని, తాను చెప్పినట్లు చేయాలని సూచించాడు. తాను పంపిన లింక్‌ను ఓపెన్ చేసి ఆ వీడియోను లైక్ చేయాలని, సంబంధిత ఛానల్‌ను సబ్‌స్రైబ్ చేయాలని చెప్పాడు. అలా చేస్తే 150 రూపాయలు వస్తుందని ఉదితాపాల్కు వివరించాడు.దానిపై స్పందించిన పాల్ ఒకేసారి వస్తుందా.. అని సైబర్ నేరగాడిని ప్రశ్నిస్తుంది. అయితే ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని తాను చెప్పినట్లు చేస్తే ఇలానే డబ్బును వస్తాయని వివరిస్తాడు. నగదును యూపీఐ, బ్యాంక్ ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తామని చెబుతాడు. తాను పంపిన లింక్‌లో వీడియోను కేవలం 10 సెకన్లు మాత్రమే చేస్తే చాలని, అనంతరం స్క్రీన్ షాట్లు పంపాలని కోరతాడు.అయితే ఆ మెసేజ్‌కు స్పందించిన ఉదితాపాల్ “మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్న ఓ వ్యక్తిని పట్టుకున్నా” అని ఉన్న ఓ స్ర్కీన్ షాట్‌ను షేర్ చేస్తుంది. అనంతరం మరో ఆఫర్ ఇస్తుంది. మీరు డబ్బులు చెల్లించరని, మోసం చేసేందుకు యత్నిస్తున్నారని తెలుసు.. అంటూ ఓ మెసెజ్ చేశారు.అనంతరం మా సంస్థలో సేల్స్ ఉద్యోగాల కోసం మీరు ఎందుకు దరఖాస్తు చేయకూడదని సలహా ఇస్తారు. మీ లింక్డిన్ ప్రోఫైల్‌ను తనతో పంచుకోవాలని సూచిస్తారు. అయితే ఆ మెసెజ్‌లు సైబర్నేరగాడికి పంపబడవు. దీంతో “మీరు నన్ను బ్లాక్ చేశారా” అంటూ ఉదితాపాల్ సైబర్ నేరగాడిని మరో ప్రశ్న అడుగుతారు. తాను మోసం చేసేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిపోయిందని గ్రహించిన సైబర్ నేరగాడు.. ఉదితా పాల్‌ను వాట్సాప్‌లో బ్లాక్ చేస్తాడు.తనకు, సైబర్ నేరగాడికి మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్‌కు సంబంధించిన స్ర్కీన్ షాట్‌ను ఉదితాపాల్.. ట్విట్టర్లో షేర్ చేశాడు. దీనిపై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. సైబర్ నేరగాడికి చిక్కకుండా.. అతడిని ఆటపట్టించిన ఉదితాపాల్పై ప్రశంసలు కురిపిస్తున్నారు. 142వేల మంది ఈ ట్వీట్‌ను చూసి, స్పందించారు.సబర్ నేరగాళ్లు ఇదే విధంగా తాము పంపిన లింక్‌ను ఓపెన్ చేయాలని, లేదా మీకు వచ్చిన OTPని చెప్పాలని కోరుతారు. సరైన ధ్రువీకరణ లేకుండా ఎవరికీ ఎటువంటి వివరాలు చెప్పడం, లేదా వారు చెప్పిన లింక్‌ను ఓపెన్ చేయకపోవడమే మంచిది. పొరపాటుగా లేదా అత్యాశకు పోయి ఎటువంటి వివరాలు వెల్లడించినా.. మీ ఖాతా నుంచి నగదు ఖాళీ చేసేస్తారు.