కె.కోటపాడు,ఫిబ్రవరి10(ఆంధ్రపత్రిక):కళకు ప్రాణం పోయాలంటే కళాకారులకు ప్రోత్సాహం, అవకాశం ఎంతో అవసరం. నృత్య కళాకారులకైనా, చిత్రకారులకైనా కరతాళ ధ్వనులు కరచాలనాలే కొడంత అండ, దండ. కళల్లో చిత్రలేఖన మొకటి.ఆ చిత్రలేఖనంలో పెన్సిల్ తో బొమ్మలు వేయడం ఓప్రత్యేకత. ఆండ్రాయిడ్ ఫోన్లు, అనేక ఆర్ట్స్ యాప్లు(అప్లికేషన్స్) అందుబాటులోకి రావడంతో చిత్రకారుల చేతికి పని, చిత్రాలకు ఆదరణ కరువైంది. స్మార్ట్ ఫోన్స్ లో పెన్సిల్ స్కెచ్ ఆర్ట్స్ క్షణాల్లో రెడీ అవుతున్నాయి. అయినా పెన్సిల్ తో బొమ్మలు వేసే ఔత్సాహిక కళాకారులు అక్కడక్కడ లేకపోలేరు. అనకాపల్లి జిల్లా కశింకోటకు చెందిన దిగుమర్తి కీర్తన గోపాల పట్నం ఎస్.వి.వి.పి. డిగ్రీ కాలేజ్ లో చదువుతోంది.పెన్సిల్ తో బొమ్మలు వేయడమంటే ఆసక్తి. తను ఉంటున్న కాలేజీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గెడ్డం లక్ష్మి ఫోటోను పెన్సిల్ తో గీసింది. క్షణాల్లో స్మార్ట్ ఫోన్ లో పెన్సిల్ స్కెచ్ తో మన ఫోటోను మనం చూసుకునే అవకాశం ఉన్నా స్వహస్తాలతో కీర్తన గీసిన బొమ్మ ఆకట్టుకుంది. సహచర విద్యార్థుల నుంచి ప్రశంసలు, ప్రోత్సాహం అందుకుంది.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!