UAE Supreme Court : యూఏఈ సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. దుబాయ్ లో 2019 సంవత్సరంలో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి తీర్పు ఇచ్చింది.దుబాయ్ లో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భారతీయుడికి నష్ట పరిహారం కింద రూ.11 కోట్ల చెల్లించాలంటూ ఇన్సూరెన్స్ కంపెనీ ఆదేశించింది. వివరాళ్లోకి వెళ్తే భారత్ కు చెందిన మహ్మద్ బేగ్(20) దుబాయ్ లో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. 2019 సంవత్సరంలో మహ్మద్ బేగ్ ఓ రోజు ఒమన్ నుంచి యూఏఈకి బస్సులో ప్రయాణిస్తున్నాడు.అతడు ప్రయాణిస్తున్న బస్సు ఓవర్ హైడ్ హైట్ బారియర్ ను ఢీ కొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. వీరిలో 17 మంది మృతి చెందారు. మృతుల్లో 12 మంది భారతీయులు ఉన్నారు. కాగా, బస్సు ప్రమాదంలో బేగ్ తీవ్రంగా గాయపడ్డారు. అతడి మెదడులో సగభాగం పూర్తిగా దెబ్బతినడంతో చదువు అర్ధాంతరంగా నిలిచిపోయింది. ప్రమాదం అనంతరం బేగ్ సుమారు 14 రోజుల పాటు అపస్మారక స్థితిలో ఉన్నారు.ఆ తర్వాత 2 నెలలకు పైగా ఆస్పత్రిలో చికిత్స పొందాడు. ఈ ప్రమాదంలో బేగ్ మెదడుకు 50శాతం మేర శాశ్వతంగా నష్టం వాటిల్లందని డాక్టర్లు పేర్కొన్నారు. దీంతోపాటు అతని ఇతర శరీర భాగాలు కూడా దెబ్బతిన్నట్లు వెల్లడించారు. ఈ ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ కు అక్కడి కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. అంతేకాకుండా బాధిత కుటుంబాలకు 3.4 మిలియన్ దిర్హామ్ల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.అయితే, బేగ్ కు ఇన్సూరెన్స్ కంపెనీ కేవలం ఒక దిర్హామ్ మాత్రమే చెల్లించేందుకు ముందుకు వచ్చింది. అందుకు బేగ్ కుటుంబం ఒప్పుకోలేదు. ప్రమాద తీవ్రత దృష్ట్యా అది సరిపోదంటూ కోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో బేగ్ కు 5 మిలియన్ దిర్హామ్ల నష్ట పరిహారం చెల్లించాల్సిందిగా యూఏసీ సుప్రీంకోర్టు ఇన్సూరెన్స్ కంపెనీని ఆదేశించింది. కోర్టు తీర్పుతో బేగ్ కు భారతీయ కరెన్సీ ప్రకారం రూ.11 కోట్లు పరిహారం కింద అందనున్నాయి.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!