పదో తరగతి పరీక్ష విధానంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఇకపై పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఆరు పేపర్లు మాత్రమే నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.ఈ విధానాన్ని 2022-23 విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని పేర్కొంటూ రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు.గతంలో పదో తరగతి పరీక్షల్లో 11 పేపర్లు ఉండగా కొవిడ్ కారణంగా 7 పేపర్లకు రాష్ట్ర ప్రభుత్వం కుదించింది. సీబీఎస్ఈ సిలబస్‌కు అనుగుణంగా ఆరు సబ్జెక్టులకు ఆరు పేపర్లు మాత్రమే ఉండేలా ఫిజికల్ సైన్స్, బయోలజికల్ సైన్స్‌ను కలిపి ఒకే పేపర్‌గా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకే కొత్త విధానాన్ని తీసుకొచ్చినట్లు విద్యాశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఏడాది పొడవునా వివిధ పరీక్షలు నిర్వహిస్తుండడంతో 11 పరీక్షలు అవసరం లేదని ప్రభుత్వం భావించినట్లు ఉత్తర్వుల్లో తెలిపింది.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!