వెలుగోడు రిజర్ ఫారెస్ట్ సమీపంలోని గట్టు తాండ వద్ద అడివిలోకి నాటు తుపాకులతో వేటకు వెళ్తున్న ఆరుగురు వ్యక్తులు అరెస్ట్ చేసి వారి దగ్గరి నుండి ఆరు నాటు తుపాకులు, ఆరు లీటర్ ల నాటు సారాయి ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. పారిపోయిన నిందితుల కోసం గాలిస్తున్నామని త్వరలోనే అరెస్టు చేస్తామని సిఐ నాగభూషణం తెలియజేశారు.
నల్లమల అడవి ప్రాంతంలో యధేచ్చగా వన్య ప్రాణి వేట కొనసాగుతుంది. అటవీ శాఖ పోలీసులు వేటగాళ్ల నుంచి నాటు తుపాకులు స్వాధీనం చేసుకుంటుండటంతో ఒక్కసారిగా నల్లమల అడవి ప్రాంతం ఉలిక్కిపడింది. నల్లమల అడవిలో జింకలను, దుప్పులను వేటాడి వాటి మాంసం 500 రూపాయలు చొప్పున అమ్మడమే వృత్తిగా చేసుకున్న కొందరు వేటగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. వెలుగోడు అడవి ప్రాంతంలో అడవి జంతువుల వేటకు వెళ్తున్న ఆరుగురు వేటగాళ్ళు అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 06 నాటు తుపాకులను, నాటు సారాను కర్నూలు జిల్లాకు చెందిన పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అక్రమ తుపాకులు కలిగి వుంటే కఠిన చర్యలు
వెలుగోడు రిజర్ ఫారెస్ట్ సమీపంలోని గట్టు తాండ వద్ద అడివిలోకి నాటు తుపాకులతో వేటకు వెళ్తున్న ఆరుగురు వ్యక్తులు అరెస్ట్ చేసి వారి దగ్గరి నుండి ఆరు నాటు తుపాకులు, ఆరు లీటర్ ల నాటు సారాయి ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. పారిపోయిన నిందితుల కోసం గాలిస్తున్నామని త్వరలోనే అరెస్టు చేస్తామని సిఐ నాగభూషణం తెలియజేశారు. ఎవరైనా అక్రమంగా ఆయుధాలు కలిగి ఉంటే స్వచ్ఛందంగా వచ్చి పోలీస్ స్టేషన్లో అప్పజెప్పాలని.. అప్పుడు వారిపై చర్యలు తీసుకుని అవకాశం తక్కువగా ఉంటుందని చెప్పారు. కనుక ఎవరైనా ఆయుధాలను అక్రమంగా తమ ఉంచుకుంటే.. వాటిని స్వచ్ఛందంగా ఆత్మకూరు పోలీస్ స్టేషన్ లో అప్పజెప్పాలని సీఐ సూచించారు.
అరెస్ట్ అయిన ఆరు మంది నేర చరిత్ర పరిశీలిస్తే అందరూ గతంలో నేరచరిత్ర కలిగి ఉన్నారని.. ఇప్పటికే వీరిపై పలు సంఘటనల్లో కేసులు నమోదు అయ్యాయని వెల్లడించారు. నిందితుల్లో కొందరు గంజాయి మరికొందరు సారా మరికొందరు గలాటా కేసుల్లో నిందితులుగా ఉన్నారని వీరిని కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కు తరలిస్తామని సీఐ నాగభూషణం తెలియజేశారు
ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించి ముద్దాయిలను అరెస్టు చేసిన ఆత్మకూరు సీఐ, ఎస్ఐలు వెలుగోడు ఎస్సైలను కానిస్టేబుల్ సిబ్బందిని ఎస్పీ రఘువీరారెడ్డి అభినందించారు.