మధ్యంతర బెయిల్ పొడిగింపునకు నో
2న యధావిధిగా లొంగిపోవాలని ఆదేశం
న్యూఢల్లీి,ఢల్లీి,మే29(: ముఖ్యమంత్రి అరవింద్ కేజీవ్రాల్కు సుప్రీంకోర్టు నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మధ్యంతర బెయిల్‌ను పొడిగించాలని పిటిషన్ దాఖలు చేయగా దానిని కోర్టు తిరస్కరించింది. కేజీవ్రాల్ దరఖాస్తును స్వీకరించేందుకు కోర్టు రిజిస్టీ నిరాకరించింది. రెగ్యులర్ బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లే స్వేచ్ఛ కేజీవ్రాల్కు ఇచ్చింది. కేజీవ్రాల్ దరఖాస్తు విచారణకు అర్హమైనది కాదు. ఇప్పుడు సీఎం కేజీవ్రాల్ జూన్ 2న లొంగిపోవాల్సి ఉంటుంది. మే 10న జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా కేజీవ్రాల్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు. జూన్ 2న తీహార్ జైలులో లొంగిపోవాలని కోరారు. మే 17న పీఎంఎల్ఏ కేసులో అతని అరెస్టు చట్టబద్ధత పై సవాలు చేస్తూ ఈడీపై ధర్మాసనం తన తీర్పును రిజర్వ్ చేసింది. మంగళవారం, సుప్రీంకోర్టులోని మరో బెంచ్ కూడా కేజీవ్రాల్ పిటిషన్‌ను విచారించడానికి నిరాకరించింది. సీజీఐ డీవై చంద్రచూడ్‌ను సంప్రదించాలని కోరింది. అరవింద్ కేజీవ్రాల్ అకస్మాత్తుగా ఆరేడు కిలోల బరువు తగ్గినందున అనేక వైద్య పరీక్షలు చేయించుకోవడానికి మధ్యంతర బెయిల్ వ్యవధిని ఏడు రోజులు పొడిగించాలని సుప్రీంకోర్టును అభ్యర్థించారు. తిరిగి జైలుకు వెళ్లేందుకు కోర్టు నిర్దేశిరచిన జూన్ 2న కాకుండా జూన్ 9న లొంగిపోవాలని కేజీవ్రాల్ మే 26న దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు.
అతని బరువు ఆరేడు కిలోల వరకు తగ్గిందని, అతని కీటోన్ స్థాయి చాలా ఎక్కువగా ఉందని, ఇది తీవ్రమైన కిడ్నీ, గుండె జబ్బులు, క్యాన్సర్‌కు కూడా సూచిక అని పిటిషన్లో పేర్కొంది. ముఖ్యమంత్రికి పీఈటీ-సీటీ స్కాన్‌తోపాటు కొన్ని వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉందని పిటిషన్లో పేర్కొన్నారు. మే 10న లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జూన్ 1వ తేదీ వరకు అంటే 21 రోజుల వరకు కేజీవ్రాల్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దాని ప్రకారం జూన్ 2న తిరిగి జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. ఎక్సైజ్ పాలసీ స్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కేజీవ్రాల్ను అరెస్టు చేశారు. జూన్ 2న కేజీవ్రాల్ లొంగిపోవాలని కోర్టు ఆదేశించింది. దీనికి ఒకరోజు ముందుగా ఏడో, చివరి దశ ఓటింగ్ జరగనుంది.
ఢల్లీిలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో ఈడీ కేజీవ్రాల్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీని నిందితుడిగా చేర్చింది. ఈ కుంభకోణంతో ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజీవ్రాల్కు, పార్టీకి సంబంధం ఉందని ఈడీ కోర్టుకు తెలిపింది. ఈ కుంభకోణంలో ప్రధాన కుట్రదారు అరవింద్ కేజీవ్రాల్ అని, ఇందులో ఇతర ఆప్ నేతలు, ప్రైవేట్ వ్యక్తులు కూడా ఉన్నారని ఈడీ ఆరోపించింది.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!