ముగిసిన చార్ధామ్ యాత్ర
హరిద్వార్,అక్టోబర్ 27 (ఆంధ్రపత్రిక): ఉత్తరాఖండ్ చార్ధామ్ యాత్ర ముగియడంతో గురువారం కేదార్నాథ్ ఆలయాన్ని మూసివేశారు. శీతాకాలంలో ఆలయం మంచులో కూరుకుపోతుంది. ఈ నేపథ్యంలో ఉదయం పూజా కార్యక్ర మాలు నిర్వహించిన అనంతరం పూజారులు గుడి తలుపులు మూసివేశారు. ఆర్మీ ఆధ్వర్యంలో భక్తి శ్రద్దలతో శివ య్య పంచముఖీ దేవత విగ్రహం శ్రీ ఓంకారేశ్వరాలయం, ఉఖీమఠ్ కు తీసుకుని వచ్చారు. ఈ సమయంలో జై బోలో శంకర్ నినాదాలు చేస్తూ వేలాది మంది భక్తులు స్వామివారి వెంట నడిచారు. వచ్చే 6 నెలల పాటు ఉఖి మఠ్‌లో పూజలు నిర్వహించనున్నారు. కేదార్‌నాథ్‌తో పాటు ఉత్తర కాశీలోని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన యము నోత్రి ధామ్ ఆలయం కూడా ఇవాళ మూతపడిరది. వచ్చే ఆరు నెలల వరకు ఆలయం మూసి ఉంటుంది. యము నా దేవి గుడిని మధ్యాహ్నం 12.09 గంటలకు అభిజిత్ ముహూర్తంలో సర్వన్ సిద్ధి యోగం కింద మూసివేశారు. చార్ ధామ్ లో ఒకటైన బద్రీనాథ్ ఆలయాన్ని నవంబర్ 19న మూసివేస్తారు. హిమపాతం, శీతాకాలంలో తీవ్ర మైన చలి కారణంగా, ఏటా అక్టోబర్`నవంబర్ మాసాల్లో చార్ ధామ్‌లు మూసివేసి తదుపరి సంవత్సరం ఏప్రిల్, మే నెలల్లో తెరుస్తారు.