నిర్మల్,అక్టోబర్ 25 (ఆంధ్రపత్రిక): అన్నివర్గాలను సీఎం కేసీఆర్ మోసం చేశారని వైఎస్సార్టీపీ షర్మిల విమర్శలు గుప్పించారు. మంగళవారం లక్ష్మణ చాంద మండలం కనకపూర్ గ్రామంలో షర్మిలకు గ్రామ స్థులు ఘన స్వాగతం పలికారు. అనంతరం షర్మిల మాట్లాడుతూ… నిలబెట్టుకోలేని హావిూలు ఇవ్వడంలో కేసీఆర్ దిట్ట అని వ్యాఖ్యానించారు. ఎన్నికలు వస్తేనే ఫామ్‌హౌస్ నుంచి కేసీఆర్ బయటకొస్తారన్నారు. కేసీఆర్ తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చేశారని మండిపడ్డారు. తెచ్చిన అప్పులను కాళేశ్వరం ప్రాజెక్ట్ రూపంలో కేసీఆర్ తినేశారని ఆరోపించారు. 8 ఏళ్లుగా సీఎం కేసీఆర్ ఆడిరదే ఆటగా సాగు తోందన్నారు. ప్రశ్నించాల్సిన ప్రతిపక్షాలు కేసీఆర్‌కు అమ్ముడుపోయాయంటూ షర్మిల తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన పాదయాత్ర 189వ రోజుకు చేరుకుంది. ప్రజా ప్రస్థానం పేరుతో షర్మిల చేస్తున్న పాదయాత్ర మంగళవారం నిర్మల్ మండ లం కొండాపురం నుండి ప్రారంభమైంది. మామడ గ్రామం వరకు షర్మిల పాదయాత్ర చేయ నున్నారు. నిర్మల్ జిల్లాలో 4వ రోజు కొనసాగుతున్న షర్మిల పాదయాత్రకు జనం భారీగా హాజరయ్యారు. దారి పొడవునా ప్రజలకు అభివాదం చేస్తూ.. పలుకరిస్తూ.. కుశల ప్రశ్నలతోపాటు.. క్షేమ సమాచారాలు.. కష్ట సుఖాలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. కష్టాలు ఏకరువు పెట్టిన వారికి కారణాలు వివరించి చెబుతూ.. తాను అండగా ఉంటానని.. రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ఆశీర్వదించాలని కోరుతున్నారు. తాను ప్రభుత్వం ఏర్పాటు చేశాక దివంగత వైఎస్ఆర్ హయాంలో అమలు చేసిన అన్ని సంక్షేమ పథకాలను పునరుద్ధరించడంతోపాటు.. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పేదలందర్నీ ఆదుకునే ప్రయత్నం చేస్తానని షర్మిల భరోసా ఇచ్చారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!