హైదరాబాద్,ఆగస్ట్16(ఆర్‌ఎన్‌ఎ): తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యవస్థలను అవమానిస్తున్నారని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి విమర్శించారు. గవర్నర్ తేనేటి విందుకు హజారు కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తులను, వ్యవస్థలను గౌరవించని దుస్థితిలో కెసిఆర్ ఉన్నారని ఘాటుగా విమర్శించారు. హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజ్ పేయి వర్థంతి కార్యక్రమంలో పాల్గొని.. ఆమహానీయునికి నివాళులర్పించారు. అనంతరం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విూడియాతో మాట్లాడుతూ.. సమాజంలో వ్యక్తులు శాశ్వతం కాదని.. వ్యవస్థలు శాశ్వతమన్నారు. కేసీఆర్ ఈరోజు ఉంటారు, రేపు పోతారు కాని వ్యవస్థలు ఎప్పటికి ఉంటాయన్నారు.
ఓటమి భయంతోనే కేసీఆర్ తప్పుల విూద తప్పులు చేస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. గవర్నర్ ఏర్పాటుచేసిన ’ఎట్ హోం’ కార్యక్రమానికి గైర్హాజరై సంప్రదాయాలను కేసీఆర్ మంటగల్పు తున్నారని ఆరోపించారు. గవర్నర్ పర్యటనలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించకపోవటం రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్యానించారు. కేసీఆర్ సర్కారు గవర్నర్‌ను అడుగడుగునా అవమానాలకు గురిచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ సర్కార్‌ను ప్రజలు పాతరేయటానికి సిద్ధంగా ఉన్నారని..తన కాళ్ళ కింద భూమి కదలిపోతోందన్న ఆందోళనలో కేసీఆర్ ఉన్నారని అన్నారు. బండి సంజయ్ పాదయాత్రపై టీఆర్‌ఎస్ శ్రేణులు దాడులు చేయడాన్ని కిషన్ రెడ్డి ఖండిరచారు. నిరాశ, నిస్పృహతో కేసీఆర్ ప్రభుత్వం దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు. కేటీఆర్ ఎప్పటికీ సీఎం కాలేడన్న ఫ్రస్టేషన్?లో కేసీఆర్ ఉన్నాడని..ప్రధాని మోడీ సహా కేంద్రానికి ఆయన సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణ కు ఏం చేశారని.. దేశాన్ని ఉద్దరిస్తావంటూ ప్రశ్నించారు. ఇంజనీర్ల సూచనలను పక్కనపెట్టి సొంత ఆలోచనతో సాగునీటి ప్రాజక్టులను నిర్మించి..ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని మండిపడ్డారు. సెంటిమెంట్ తో ముఖ్యమంత్రి కుర్చీలో కేసీఆర్ ఎక్కువ కాలం కూర్చోలేడని చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో వ్యవస్థలను, సంప్రదాయాలను గౌరవించాలని పేర్కొన్నారు. గవర్నర్ ని, వ్యవస్థని సీఎం కేసీఆర్ అవమాని
స్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా గెలిచే పార్టీ బీజేపీ అని విశ్వాసం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ దిగజారి మాట్లాడుతున్నారని అన్నారు. మునుగోడులో తమ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని విమర్శించారు. తమ పార్టీకి కేసీఆర్ భయపడుతున్నారని, కొడుకును సీఎం చేయలేకపోతున్నాననే ఆందోళన లో ఉన్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ కుటుంబానికి ప్రధాని నరేంద్రమోదీ నచ్చకపోవచ్చని, దేశ ప్రజలకు నరేంద్రమోదీ అంటే ఇష్టమని తెలిపారు. టీఆర్ ఎస్ నాయకులు నిరాశ, నిసృ?పహలె ఉన్నారని.. అందుకే రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పాదయాత్రపై దాడులు చేస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!