11న విూ ఇంట్లోనే ఉదయం 11 గంటలకు వస్తాం
విచారణకు సిద్దంగా ఉండాలంటూ కవితకు సిబిఐ మెయిల్
న్యూఢల్లీి,డిసెంబర్ 6 (ఆంధ్రపత్రిక): ఢల్లీి లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితను ఈ నెల 11గంటలకు ఆమె నివాసంలోనే విచారిస్తామని సిబిఐ తెలియచేసింది. కవిత రాసిన లేఖరు అనుగుణంగా సీబీఐ అధికారులు ఆమెకు సమాధానం ఇచ్చారు. ఈనెల 11న ఆదివారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లోని కవిత నివాసంలో విచారించను న్నట్లు వెల్లడిరచారు. దీంతో 11న కవిత అందుబాటులో ఉండాలని ఈ మెయిల్ లో సమాచారం అందించారు. విచారణ కోసం ఈ నెల 11, 12, 14, 15వ తేదీల్లో తన నివాసంలో అందుబాటులో ఉంటానని.. అందులో అనువైన రోజున తనతో సమావేశం కావచ్చని సీబీఐకి కవిత లేఖ రాసింది. ఈ నేపథ్యంలో లిక్కర్ స్కాం కేసులో విచారణ కోసం టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో ఈ నెల 11న సమావేశం కావడానికి సీబీఐ అంగీక రించింది. లిక్కర్ స్కామ్లో ఢల్లీి డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, మరికొందరిపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో తన పేరు ఎక్కడా లేదని, మంగళవారం విచారణకు రావడం వీలుకాదని సీబీఐకి కవిత లేఖ రాశారు. సోమవారం ప్రగతి భవన్లో కేసీఆర్తో ఆమె భేటీ తర్వాత ఢల్లీి సీబీఐ డీఐజీ రాఘవేంద్ర వస్తాకు లెటర్ పంపారు. ఈ కేసులో కంప్లైంట్ కాపీ, ఎఫ్ఐఆర్ ఇవ్వాలన్న తన విజ్ఞప్తికి సీబీఐ నుంచి ఈ`మెయిల్ అందిందని కవిత తెలిపారు. సీబీఐ వెబ్సైట్లో పొందుపరిచిన ఎఫ్ఐఆర్ కాపీని క్షుణ్నంగా పరిశీలించానని, అందులో పేర్కొన్న నిందితుల జాబితాలో తన పేరు ఎక్కడా లేదని అన్నారు. తనకు సీఆర్పీసీ 160 కింద సీబీఐ పంపిన నోటీసులకు ఈ నెల 6న (మంగళవారం) తన నివాసంలో అందుబాటులో ఉంటానని ముందు వెల్లడిరచానని, అయితే.. ముందే ఖరారైన కార్యక్రమాల వల్ల 6న తాను సీబీఐ అధికారులను కలువలేకపోతున్నానని తెలిపారు. తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తినని, సీబీఐ దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానని ఆమె పేర్కొన్నారు. ఈ నెల 11, 12, 14, 15 తేదీల్లో ఏదో ఒక రోజు హైదరాబాద్లోని తన నివాసంలో వివరణ ఇచ్చేందుకు అందుబాటులో ఉంటానని సీబీఐకి లేఖలో తెలియజేశారు. ఢల్లీి లిక్కర్ స్కాంకు సంబంధించి అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరును ఈడీ పేర్కొన్న తర్వాత 3 నుంచి వరుసగా సోమవారం వరకు మూడు రోజులు ప్రగతి భవన్లో కవిత సీఎం కేసీఆర్తో సమావేశయ్యారు. వీరి భేటీలో న్యాయనిపుణులు పాల్గొన్నారు. లీగల్ ఎక్స్పర్ట్లు, కేసీఆర్ సూచనతోనే మంగళవారం కాకుండా మరో తేదీన విచారణకు రావాలని సీబీఐకి లేఖ రాశారు.