సంపదను సృష్టిస్తూ.. పెంచిన సంపదను పేదలకు పంచడంలో తెలంగాణ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. సీఎం కేసీఆర్ పారిశ్రామికవేత్తలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో, పాడిపరిశ్రమకూ అంతే ప్రాధాన్యత ఇస్తారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ మేనిఫెస్టోను పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చిత్తు కాగితంగా పోల్చడాన్ని తప్పుపట్టారు కవిత.
సంపదను సృష్టిస్తూ.. పెంచిన సంపదను పేదలకు పంచడంలో తెలంగాణ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. సీఎం కేసీఆర్ పారిశ్రామికవేత్తలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో, పాడిపరిశ్రమకూ అంతే ప్రాధాన్యత ఇస్తారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ మేనిఫెస్టోను పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చిత్తు కాగితంగా పోల్చడాన్ని తప్పుపట్టారు కవిత. ఎవరి మేనిఫెస్టో.. ఏ పార్టీ చిత్తు కాగితమో.. ప్రజలే ఓట్ల రూపంలో తేలుస్తారన్నారు. అబద్దాలు ఆడటంలో ఆరితేరిన పార్టీ బీజేపీ అని ఆరోపించారు కవిత.. ఆ పార్టీ 119 స్థానాల్లో డిపాజిట్ కోల్పోవడం ఖాయమన్నారు
తెలంగాణ ప్రజల కోసం సీఎం కేసీఆర్ మంచి మేనిఫెస్టోను విడుదల చేశారని తెలిపారు. ప్రగతి పథంలో దూసుకెళ్తన్న తెలంగాణను మరింత ముందుకు తీసుకెళ్లేలా మెనిఫోస్టో ఉందని అన్నారు. సంపదను సృష్టిస్తూ ఆ సృష్టించిన సంపదను పేద ప్రజలకు పంచుతూ దేశంలోనే తెలంగాణను ప్రత్యేక మోడల్ ను సృష్టించామని స్పష్టం చేశారు. మనం సృష్టించిన మోడల్ గురించి దేశ ప్రజలు చర్చించుకుంటున్నారన్నారు. 2014లో రూ. లక్షా 12 వేలుగా ఉన్న తలసరి ఆదాయం ఈనాడు రూ. 3 లక్షల 15 వేలకు చేరిందంటేనే తెలంగాణ ఎంత అభివృద్ధి చెందిందో తెలుస్తుందన్నారు. సీఎం కేసీఆర్ అందరినీ సమానంగా చూసే వ్యక్తి కాబట్టి పారిశ్రామికవేత్తలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో పాడి పరిశ్రమదారులకూ అంతే ప్రాధాన్యత ఇస్తారని వివరించారు. భూమి లేని పేదలు, పేద మహిళలను అభివృద్ధి చేసేలా మెనిఫోస్టో ఉందన్నారు. గ్రామీణఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసేలా మెనిఫెస్టో ఉందని తెలిపారు. తమ పార్టీ మెనిఫెస్టోను ప్రజలు ఆమోదిస్తారన్న విశ్వాసం ఉందని ధీమా వ్యక్తం చేశారు.
దేశవ్యాప్తంగా కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు కవిత. రాష్ట్ర విభజన హామీలు అమలు ఏది ? గత పదేళ్లలో తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదని విమర్శించారు. ఒక్క సీటులో కూడా బీజేపీకి డిపాజిట్ రాదన్న ఆమె.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్టం చేసేలా బీఆర్ఎస్ మెనిఫెస్టో రూపొందించామన్నారు. బీఆర్ఎస్ మెనిఫెస్టో పేదల వర్గాల అభ్యున్నతికి బాటలు వేస్తుందన్నారు. మెనిఫెస్టోను చూసి కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లో గుబులు మొదలైందని, ఆ పార్టీల మైండ్ బ్లాంక్ అయిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. అందుకే ఆ రెండు పార్టీల నేతల అర్థంపర్థం లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ గ్యారెంటీలు టిష్యూ పేపర్లని, అబద్దాలు చెప్పడంలో బీజేపీ ఆరితేరిందని విమర్శించారు.
ఇటువంటి మెనిఫోస్టోను విపక్షాలు కలలో కూడా ఊహించలేదని, కేసీఆర్ ఇన్ని రకాల హామీలను ప్రకటిస్తారని కాంగ్రెస్ నేతలు భావించలేదన్నారు. అధికారంలో ఉన్న పార్టీ అన్ని లెక్కలు తీసుకొని సహేతుకంగా ప్రకటించిన మెనిఫెస్టోను విపక్షాలు చిత్తు కాగితంతో పోల్చడం ఏంటని ప్రశ్నించారు. ఎటువంటి బాధ్యత, తాడూ బొంగరం లేని కాంగ్రెస్ చెప్పే మాటలు ప్రజలు ఎలా నమ్ముతారన్నారు. కర్నాటకలో హామీలు అమలు చేయలేమని అక్కడి మంత్రలే ప్రకటిస్తున్న ఉదంతాలను గుర్తు చేశారు.
అంశాలవారీగా మాట్లాడకుండా అమరవీరుల స్థూపం వద్దకు రండి… ప్రమాణం చేయండని అంటూ సవాలు చేయడం.. రేవంత్ రెడ్డి స్థాయికి తగదన్నారు. అనేక మంది అమరులయ్యారంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీయేనని విరుచుకుపడ్డారు. నిజంగా దమ్మూ ధైర్యం ఉంటే రాహుల్ గాంధీని అమరజ్యోతి వద్ద అమరవీరులకు నివాళులర్పించాలని కవిత డిమాండ్ చేశారు. అప్పుడన్నా కాంగ్రెస్ పార్టీ చేసిన పాపాలు ఏమన్న తొలగిపోతాయో చూద్దామని సవాలు విసిరారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు తెలంగాణ స్థితిగతులపై ఎటువంటి అవగాహన లేదని విమర్శించారు. ఏమి తెలియని స్థానిక నేతలు రాసిచ్చే స్క్రిప్ట్ ను చదవడం కాంగ్రెస్ జాతీయ నాయకులు మానుకోవాలని సూచించారు.
మరోవైపు బీజేపీపైన సైతం విరుచుకుపడ్డారు ఎమ్మెల్సీ కవిత. రూ. 15 లక్షలు ఒక్కో ఖాతాలో వేస్తామని చెప్పి బీజేపీ దేశ ప్రజలను విస్మరించారన్నారు. ఏటా 2 కోట్లు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి బీజేపీ మోసం చేసిందని విమర్శించారు. తెలంగాణలో 2 లక్షల 21 వేల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడమే కాకుండా ప్రైవేటు రంగంలో 30 లక్షలకుపైగా ఉద్యోగాలు సృష్టించి యువతకు భరోసా కల్పించామని కవిత వివరించారు. గత పదేళ్ల కాలంలో తెలంగాణకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని తెలిపారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా వంటి హామీలు ఏమయ్యాయో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో బీజేపీ 105 చోట్ల డిపాజిట్లుకోల్పోయిందని, ఈ ఎన్నికల్లో మొత్తం 119 సీట్లలో డిపాజిట్ కోల్పోతుందని స్పష్టం చేశారు.