నవంబర్ 09 (ఆంధ్రపత్రిక): తమిళంతో పాటు తెలుగులోనూ తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న కార్తి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. రీసెంట్గా ’సర్దార్’తో సక్సెస్ అందుకున్న కార్తి నెక్ట్స్ ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టాడు. రాజు మురుగన్ దర్శకత్వంలో కొత్త మూవీని మొదలుపెట్టాడు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్.ఆర్.ప్రకాష్ బాబు, ఎస్.ఆర్.ప్రభు నిర్మిస్తున్నారు. చెన్నైలో ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. అలాగే టైటిల్‌ను కూడా రివీల్ చేశారు. ’జపాన్’ అనే వెరైటీ టైటిల్‌తో తెరకెక్కుతోందని కన్ఫర్మ్ చేశారు. ఇది కార్తికి ఇరవై ఐదో సినిమా. అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్గా నటిస్తోంది. కమెడియన్‌గా, హీరోగా, విలన్‌గా గుర్తింపు తెచ్చుకున్న సునీల్ ఈ చిత్రంతో కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. తమిళ చిత్ర పరిశ్రమలో సినిమాటోగ్రాఫర్‌గా 25 ఏళ్ల అనుభవంతో పాటు పలు చిత్రాలతో దర్శకుడిగా సత్తా చాటిన విజయ్ మిల్టన్ ఈ సినిమాతో నటుడిగా ప్రూవ్ చేసుకోబోతున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నాడు. త్వరలోనే మొదటి షెడ్యూల్ స్టార్ట్ చేసి, ఫస్ట్ లుక్‌ను విడుదల చేస్తామన్నారు నిర్మాతలు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!